కండోమ్స్‌తో అరాచకం…మరిగించి తాగుతున్న విద్యార్థులు..! ఎందుకంటే…

-

కోల్‌గెట్‌ పేస్ట్‌ను బ్యూటీ టిప్స్‌కు వాడినట్లు..కండోమ్స్‌ను కిక్‌కోసం వాడుతున్నారు ఆ విద్యార్థులు.. జనరల్‌గా కండోమ్‌తో సెక్స్‌ చేస్తే అంత కిక్‌ రాదని అంటారు. మరీ ఆ విద్యార్థులు కిక్‌ కోసమే కండోమ్స్‌ ఎందుకు వాడుతున్నారేగా మీ డౌట్‌.. వాళ్లు ఆ దానికి కాదు..పని వేరే ఉంది..? అసలు వాటితో అంతకు మించి ఇంకే చేస్తారు..? కండోమ్‌లో నీటిలో మరిగించి తాగుతున్నారటా..? ఔను మీరు విన్నది నిజమే..! వీళ్లకేం పోయేకాలం వచ్చింది అవి తాగడానికి అనుకుంటున్నారా..? కారణంగా కిక్కిచ్చేదేనండోయ్..!!

- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో విద్యార్థులు కండోమ్‌ల వాడకానికి అలవాటు పడ్డారు. వాళ్లు ఆ కండోమ్‌లు కొనుగోలు చేసి వాటిని మరిగించుకుని తాగుతున్నారు..కండోమ్‌లు కొనుగోలు చేస్తున్న విద్యార్థులు.. వాటిని వేడి నీటిలో నానబెట్టి, ఆ ద్రవాన్ని తాగుతున్నారు. దీంతో వారికి సుమారు 10 నుంచి 12 గంటల వరకు కిక్కు వస్తుందట..

దుర్గాపూర్ సిటీ సెంటర్, బిధాన్‌నగర్, బెనచిటి, ముచ్చిపారా, సి జోన్, ఎ జోన్‌ తదితర పరిసరాల్లో ఫ్లేవర్(సువాసనలు వెదజల్లే) కండోమ్‌ల అమ్మకాలు బాగా పెరిగాయి. కుర్రాళ్లు కట్టల కట్టల కండోమ్‌లు కొనుగోలు చేస్తుంటే.. ఓ మెడికల్ షాప్ యజమానికి అనుమానం వచ్చి..ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వాళ్లు కండోమ్‌లు వాడుతున్నది లైంగిక చర్యలకు కాదని, వాటిని డ్రగ్స్‌గా తీసుకుంటున్నారని తేలింది.

‘ఇదివరకు రోజుకు మూడు నుంచి నాలుగు ప్యాకెట్ల కండోమ్‌లు మాత్రమే అమ్ముడయ్యేవి. ఇప్పుడు కట్టకట్టల కండోమ్‌లు అమ్ముడవుతున్నాయి’’ అని ఆ ఏరియా మెడికల్‌ షాప్‌ యజమాని అంటున్నాడు. ఓ కెమిస్ట్రీ టీచర్ దీని గురించి వివరిస్తూ.. ‘‘కండోమ్‌లను వేడి నీటిలో ఎక్కువసేపు నానబెట్టడం వల్ల పెద్ద ఆర్గానిక్ అణువులు విచ్ఛిన్నమై ఆల్కహాల్ సమ్మేళనాలు ఏర్పడతాయి. ఆ ద్రవం డ్రగ్స్ తరహాలో మత్తు ఇస్తుంది’’ అని పేర్కొన్నారు..సువాసనలు వెదజల్లే కండోమ్‌లలో మాత్రమే ఆల్కహాల్ ఉంటుందని మరో నిపుణుడు తెలిపాడు.

దగ్గు సిరప్, హ్యాండ్ శానిటైజర్, ఆప్టర్ సేవ్, జిగురు, పెయింట్, నెయిల్ పాలిష్, వైట్‌నర్, మార్కర్స్‌లో కూడా ఇలాంటి ఆల్కహాల్ ఉంటుంది. అయితే, వాటిని తీసుకోవడం చాలా ప్రమాదకరం. అయితే, ఈ విధంగా మత్తులో చేసే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కష్టమేనట.

ఇటీవల హైదరాబాద్ అధికారులు స్పందిస్తూ.. మార్కెట్లో లభించే వస్తువులకు బానిసయ్యేవారిపై చర్యలు తీసుకోడానికి భారతీయ శిక్షాస్మృతిలో సంబంధిత నిబంధనలు లేవని తెలిపారు. వైట్‌నర్లు, దగ్గు సిరప్‌లు వంటి ఉత్పత్తులు నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ చట్టం పరిధిలోకి రావు. ఎందుకంటే వాటిలో తక్కువ పరిమాణంలో మత్తుమందులు (NDPS) ఉంటాయట. ఇప్పుడు విద్యార్థులు ఇలా చేయడాన్ని తప్పుగా పరిగణించి అరెస్ట్‌ చేసే రైట్‌ పోలీసులు ఉందా లేదా కూడా తెలియడం లేదట..? ఏది ఏమైనా విద్యార్థులు ఇలాంటి వాటికి అలవాటు పడి భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. వాటి వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయో కూడా చెప్పలేం..!
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...