బీహార్ పరీక్షలో టాపర్ గా నిలిచిన సన్నీ లియోన్..!

-

Sunny Leone Tops Bihar Exam

సన్నీ లియోన్.. ఈమె గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఆమె ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఎలాగో తెలుసా? మీరనుకున్నట్టు కాదు. బీహార్ పరీక్షలో టాప్ గా నిలిచింది. తాజాగా బీహార్ లో జరిగిన జూనియర్ ఇంజినీర్ పరీక్షలో సన్నీ లియోన్ టాప్ లో నిలిచింది. సన్నీ లియోన్ కు ఒక్కసారిగా చదువు మీద ధ్యాస మళ్లడం ఏంది. మళ్లీ టాపర్ గా నిలవడం ఏంది అని ఆశ్చర్యపోకండి. అసలు సన్నీ పరీక్షలే రాయలేదు. ఈ విషయం తెలుసుకొని సన్నీ కూడా షాకయింది. ఇంతకీ ఏం జరిగిందంటే…

బీహార్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ఇటీవల జూనియర్ ఇంజినీర్ పోస్టుల కోసం పరీక్షలు నిర్వహించింది. అయితే.. ఈ పరీక్షల్లో సన్నీ లియోన్ పేరు టాప్ లో ఉంది. అయితే టెక్నికల్ సమస్య వల్ల అలా సన్నీ లియోన్ పేరు వచ్చిందట. సన్నీ లియోన్ కు 27 ఏళ్లు అని.. ఆమె తండ్రి పేరు లియోనా లియోన్ అని… సన్నీకి 98.50 శాతం మార్కులు వచ్చాయని మార్క్ షీట్ లో ఉంది. 73.50 పాయింట్లతో టాప్ పొజిషన్ లో ఉంది సన్నీ.

ఈ ఘటనపై స్పందించిన సన్నీ.. సో.. ఫన్నీ అంటూ ట్వీట్ చేసింది. మిగితా వాళ్లు కూడా బాగానే స్కోర్ చేశారు అని వెల్లడించింది. అయితే ఫలితాల్లో ఒక్క సన్నీ పేరే కాదు.. అన్నీ తికమక పేర్లు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కూడా వచ్చాయి. ఇలా.. టెక్నికల్ సమస్యలతో… ఇతర అక్రమాలు, అవినీతితో బీహార్ బోర్డ్ బాగా ఫేమస్సే.

Read more RELATED
Recommended to you

Latest news