ఇదేమి వింత బాబోయ్: పాప ఏడుపులా పక్షి అరుపు.. వింటే అవాక్కవ్వాల్సిందే

ఈ భూమి మీద ఎన్ని జీవరాశులున్నాయో లెక్కే లేదు. భూమ్మీద ఉన్నవాటికంటే సముద్రంలో ఉన్న జీవజాతుల సంఖ్య చాలా ఎక్కువ. ఇక్కడ మనిషికన్నా అందమైన జీవజాతులు చాలా ఉన్నాయి. మనిషికి అందంగా కనిపించే, ఒక్కోసారి వింతగా కనిపించే జీవులు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనిషికి తెలియని జీవజాతులు కూడా భూమ్మీద ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అంచనా. ఐతే ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని జీవులు చూడడానికి అందంగా ఉంటాయి. ఇంకొన్ని చూడడానికి వికారంగా ఉంటాయి. ఏదైనా వేటికదే ప్రత్యేకం.

ఐతే మనం ఎప్పుడూ చూడని, కనిపించిని, వినని విషయాలు జీవజాతుల్లో కనిపించినపుడు ఆశ్చర్యం వేస్తుంది. ప్రస్తుతం తరోంగ జూలో జరిగిన సన్నివేశం అలాంటిదే. ఆ జూలో ఉన్న ఒక పక్షి అరుపు పాప ఏడుపును పోలి ఉండడమే ఆశ్చర్యం. అవును, మీరు విన్నది నిజమే. పక్షి అరుపు పాప ఏడుపులా ఉంది. చిన్నపిల్లలు తల్లి కనబడకో, లేక పాల కోసమో ఏడిస్తే ఎలా ఏడుస్తారో అలా అరుస్తుంది ఆ పక్షి. గుక్కపట్టినట్టు ఏడుస్తున్న దాని అరుపు చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు.

పొద్దు పొద్దున్న పక్షి ఇలా అరవడాన్ని గమనించిన జూ సిబ్బంది, ఆ వీడియోని సోషల్ మీడియాలో ఉంచారు. అది కాస్తా వైరల్ గా మారింది. ఒక్కసారి అక్కడ పాప ఏమైనా ఉందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. అంత పర్ఫెక్ట్ గా అరిచింది ఆ పక్షి. ఈ ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. వాటిల్లో ఇదీ ఒకటి. కాకపోతే అది మనుషుల్లాగా అరవడమే మనకు కనెక్టింగ్ పాయింట్.