పంజా విసిరిన నిఫా.. కేరళలో బాలుడు మృతి.

-

కేరళలోని కోజికోడ్ జిల్లాలో 12ఏళ్ల బాలుడు నిఫా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. కోజికోడ్ లో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ బాలుడు ఆదివారం ఉదయం 5గంటల ప్రాంతంలో చివరి శ్వాస వదిలాడు. 2018లో అత్యంత వ్యాప్తి చెందిన నిఫా వైరస్ పై శనివారం రాత్రి హై లెవెల్ సమావేశం జరిగింది. ఈరోజు ఆదివారం కూడా నిఫా వైరస్ పై సమావేశం జరగనుంది. 12ఏళ్ల బాలుడి రక్త నమూనాలను పుణెలోని నేషనల్ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా, బాలుడి శరీరంలో వైరస్ ఆనవాళ్ళు ఉన్నాయని ఇన్స్టిట్యూట్ గుర్తించింది.

ఆదివారం తెల్లవారుజామున 5గంటలకు బాలుడు ప్రాణాలు వదిలాడు. ప్రస్తుతం కేరళ ఆరోగ్య మంత్రి కోజికోడ్ రానున్నారు. బాలుడి కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్ లో ఉన్నారు. కోజికోడ్ మొత్తం పూర్తి నిఘాలో ఉంది. ప్రత్యేక ఆరోగ్య బృందాలు కోజికోడ్ పరుగెత్తాయి. ఇటు కరోనాతో కేరళ పోరాటం చేస్తుంటే, ఇప్పుడు నిఫా రూపంలో మరో వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news