లక్షన్నర విలువ చేసే మంగళ సూత్రాన్ని గేద మింగేసింది. గేద మంగళసూత్రాన్ని మింగడం ఏంటా అనుకుంటున్నారా..? అదే ఇంట్లోకి వచ్చి మంగళసూత్రాన్ని తినలేదు. ఆ యజమానే తీసుకెళ్లి పెడితేని అది మింగేసింది. అర్రే అలా ఎందుకు చేశారు..? మంగళసూత్రం మింగేసిన తర్వాత గేద పరిస్థితి ఏంటో.. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో రైతు రమహరి భార్య స్నానానికి వెళ్తూ.. కందిపప్పు, వేరుశెనగ చిప్పలు ఉన్న ప్లేట్‌లో మంగళసూత్రం అనుకోకుండా పడేసింది. రామహరి భార్య మంగళసూత్రం పెట్టింది మరిచిపోయి, పొరపాటున అదే పళ్ళెం తినడానికి గేదె ముందు పెట్టింది, స్నానం చేసి తన ఇంటి పని ప్రారంభించింది. కొంత సమయం తర్వాత తన మంగళసూత్రం కనిపించకుండా పోయిందని గమనించింది. వెతికిన తర్వాత గేదెకు పెట్టిన ఆహారంలో మంగళసూత్రం పెట్టడం గుర్తొచ్చింది. వెంటనే గేదె దగ్గరకు పరిగెత్తుకెళ్లి చూస్తే అక్కడ ఖాళీ ప్లేటు ఉంది.
స్థానిక పశువైద్యుడు బాలాసాహెబ్ కౌండనేకి ఫోన్ చేసిన ఆమె తన భర్తకు సమాచారం అందించింది. వైద్యుడు మెటల్ డిటెక్టర్ ద్వారా గేదె పొట్టను పరిశీలించగా.. అందులో ఓ వస్తువు ఉన్నట్లు తెలిసింది. తరువాత, గేదె కడుపుకు శస్త్రచికిత్స నిర్వహించి కడుపులోంచి బంగారు మంగళసూత్రాన్ని బయటకు తీశారు. పాపం గేద తప్పులేకున్నా.. ఆ నొప్పిని భరించాల్సి వచ్చింది. దానికి పొట్టపై 65 కుట్లు వేశారట. రెండున్నర గంటల పాటు జరిగిన ఆపరేషన్‌తో గేద తీవ్రమైన బాధను అనుభవించింది.
ఇలా మనుషులు పొరపాటున చేసే తప్పులకు మూగ జీవులకు శిక్షపడింది. ఆ గేద కోలుకోవడానికి కనీసం రెండు మూడు నెలలు అయినా పడుతుంది. పశువలు కాపారులు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.