మేకను కుక్క కరించిందని జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి రచ్చ చేసిన వ్యక్తి

-

సాధారణంగా జనాలకు వాళ్లు పెంచుకునే జంతువుల మీద ప్రేమ ఉంటుంది. వాటిని వాళ్ల సొంత మనుషుల్లానే చూసుకుంటారు. వాటికి ఏదైనా అయితే అస్సలు తట్టుకోలేరు. అయితే జంతువులు ఏమైనా ఆరోగ్య సమస్య వస్తే.. పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాలి.. కానీ ఇక్కడ ఓ వ్యక్తి తన మేకను కుక్క కరిచిందని జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి నానా హైరానా చేశాడు. ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్‌ అవుతోంది. అక్కడ ఆ వ్యక్తి చేసిన నిర్వాకం అంతా ఇంతా కాదు..! ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!

భోజ్ పూర్‌కు చెందిన వ్యక్తి మేకను కుక్క కరిచి గాయపర్చింది. దీంతో అది తీవ్రంగా జబ్బు పడింది. దాని బాధను చూడలేక అతను జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా.. అక్కడ ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి మరీ డాక్టర్లకు తన మేక బాధను గురించి చెప్పాడు. దీంతో డాక్టర్లు, అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. అక్కడున్న వారంతా.. ఇతగాడిని వింతగా, అమాయకంగా చూడటం మొదలు పెట్టారు

లక్షలు ఖర్చైనా పర్వలేదు తన మేక కోలుకోవాలని డాక్టర్లతో వేడుకొవడంతో డాక్టర్లు అతడిని ఏం చెప్పాలో తెలియక వింతగా చూశారు. అక్కడున్న డాక్టర్లు, స్టాఫ్ అతని బాధను, జంతు ప్రేమను అర్థం చేసుకొని, అతనికి వెటర్నరీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. కానీ అతను కాసేపు మొండిగా వాదించాడు. దీంతో అక్కడ జనాలు గుంపులుగా చేరుకున్నారు. చివరకు స్థానికులు, డాక్టర్లు.. అతనికి అర్థమయ్యేలా చెప్పి, జంతువుల ఆస్పత్రికి వెళ్లేలా చేశారు. బాధపడుతున్న జంతువు పట్ల అతని అనుబంధం అతను అనారోగ్యంతో ఉన్న మేక గురించి ఎంత చింతిస్తున్నాడో దీంతో అర్ధమవుతుంది.

హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వైద్యులు, సిబ్బంది, భద్రతా సిబ్బంది చాలా ఒప్పించిన తరువాత, ఆ వ్యక్తి మేకను పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంగీకరించాడు. ఇక్కడ పశువులకు వైద్యం చేయరని, మనుషులకు వైద్యం చేస్తున్నారని చాలా వివరించారు. ఆ వ్యక్తి మేకను శివగంజ్‌లోని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాడు.. విషయం చిన్నదే అయినా.. ఒక మేక కోసం లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అన్నాడంటే అతనికి పెంపుడు జంతువులపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఈ వార్త వైరల్‌ అవడంతో నెటిజన్లు అతన్ని ప్రశంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news