చనిపోయిన పేద బ్రాహ్మణుడు ఇంట్లో డబ్బు మూటలు..లెక్కెంతో తెలుసా..!!!

-

పేద బ్రాహ్మణుడు ఇంట నోట్ల కట్టలు ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. పేద బ్రాహ్మణుడు ఏంటి, ఇంట్లో నోట్లకట్టలు ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తుని లో జరిగిన ఈ యదార్థ సంఘటన ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా నిలిచింది. వివరాల్లోకి వెళితే

తుని పట్టణంలో ముత్తి లింగం వీధిలో 70 ఏళ్ళ అప్పల వల్లీ సుబ్రహ్మణ్యం అనే బీద బ్రాహ్మణుడు ఉండేవారు. మంగళవారం రోజున ఆయన కాలం చేయడంతో భంధువులు, సన్నిహితులు, వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన తన జీవిత కాలంలో ఎంతో కష్టపడి బ్రతికారని కొంతకాలం తరువాత తోచిన సాయం చేయండి అంటూ అందరిని ఆర్జించే వారని తెలుస్తోంది. ఆయన తన సొంత ఇంట్లోనే ఉంటున్నారు. అంతేకాదు ఆ ఇంటికి సరైన వసతులు కానీ, కరెంట్ సౌకర్యం కానీ, లేదని తెలుస్తోంది. ఇదిలాఉంటే…

ఆయన దహన సంస్కారాలు అయిపోయిన తరువాత బుధవారం నాడు ఇళ్ళు సర్దుతూ ఉండగా ఒక మూలగా మాసిపోయిన గుడ్డలు మూటలుగా కట్టి ఉన్నాయట, ఒకటి తీయగా దానికింది మరొకటి అలా లెక్కకి మించిన మూటలు కనిపించాయట. ఏమిటా మూటలు అని తెరిచి చూడగా అన్నీ డబ్బుల మూటలే..వాటిని చూసి షాక్ తిన్న బంధువులు లెక్క పెట్టడం మొదలు పెట్టారు. ఎంతగా లెక్కపెట్టినా తరగక పోవడంతో కౌంటింగ్ మిషిన్ తీసుకువచ్చి మరీ లెక్కపెట్టారు.

తీరా అంతా అయ్యాక మొత్తం లెక్క సుమారు 5 లక్షలు తేలిందట. దాంతో నోళ్ళు వెళ్ళబెట్టిన భందువులు ఆయన కొడుకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం సరిపోయిందట. ఆనోటా ఈ నోటా ఈ విషయం తెలియడంతో మీడియాలో కూడా ఈ విషయం బాగా పాపులర్ అయ్యి చివరికి తండోపతండాలుగా ఆ ప్రాంతానికి అందరూ తరలి వెళ్లారట. అయితే ఈ డబ్బు మొత్తాన్ని పేద బ్రాహ్మణుల సంక్షేమానికి ఉపయోగిస్తామని కొడుకు భీమ శంకర్ తెలిపారు.  

Read more RELATED
Recommended to you

Latest news