ప్ర‌పంచంలోనే వింత మ‌హిళ‌.. నాలుగు కాళ్లతో పుట్టిన అందగత్తె!

జన్యు లోపాలతో అనేక మంది శిశువులు జన్మిస్తూ… ఉంటారు కానీ వారు బతికి బట్టకట్టడం చాలా అరుదు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ… మైర్ ట్లే కార్బిన్ అనే మహిళ మాత్రం నాలుగు కాళ్లతో జీవించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాలుగు కాళ్లతో జీవించడమే కాదు పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. అయినా ఆమె జన్మ రహస్యం మాత్రం ఎవరికీ అంతుచిక్కలేదు.

1868లో లింకన్‌ కౌంటీలో ఓ మహిళ ప్రసవించగా నాలుగు కాళ్లతో ఓ శిశువు జన్మించింది. అది చూసిన వైద్యులు నోరెళ్లబెట్టారు. తర్వాత పరీక్షలు చేసి జన్యు కారణాల వల్లే ఇలా నాలుగు కాళ్లతో శిశివు జన్మించిందని తేల్చారు. కవలలుగా పుట్టాల్సిన ఇద్దరు సరిగ్గా పిండం అభివృద్ధి చెందక ఒక్కరుగా నాలుగు కాళ్లతో జన్మించారని తెలిపారు. నాలుగు కాళ్లు మాత్రమే కాకుండా ఆ శిశువుకు రెండు జననేంద్రియాలు, రెండు గర్భసంచులు ఉండేవి. ఇలా ఆ అమ్మాయికి నాలుగు కాళ్లున్నా ఒక కాలు మాత్రమే పనిచేసేది. ఆమెను చూడడానికి నడుము పై భాగం వరకు మామూలుగానే కనిపించేది. కానీ కింద చూస్తేనే నాలుగు కాళ్లతో వింతగా ఉండేది. నాలుగు కాళ్లున్నా అందులో ఒక కాలు మాత్రమే పని చేసేది. ఇలా వింతగా ఉండడంతో ఆ అమ్మాయిని ఓ సర్కస్ కంపెనీ వాళ్లు తమ బృందంలో చేర్చుకుని దిమ్మతిరిగిపోయే జీతం ఆఫర్ చేశారు. దాంతో కార్బిన్ చిన్ననాటే రెండు చేతులా సంపాదించడం మొదలు పెట్టింది. కార్బిన్ ఆ సర్కస్ కంపెనీ వాళ్లు వారానికి 450 డాలర్లు చెల్లించేవారు.

ఇలా నాలుగు కాళ్లతో అందరినీ ఆశ్చర్య పరిచిన కార్బిన్ తాను 19వ పడిలోకి అడుగుపెట్టగానే క్లింటన్ బిక్ నెల్ అనే వైద్యుడిని వివాహమాడి అతడితో ఐదుగురు పిల్లలను కన్నది. ఇలా ఆమె గర్భవతిగా ఉన్నపుడే ఆమెకు రెండు గర్భాశయాలు ఉన్నాయనే విషయం వైద్యులకు తెలిసింది. ఇలా కార్బిన్ నలుగురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది. కానీ 1928లో కార్బిన్ మరణించింది. ఆమె డెడ్ బాడీని తమకు పరిశోధనల నిమిత్తం అప్పగించమని అందుకు భారీగా డబ్బులు ఇస్తామని పలువురు ఆఫర్ చేసినా… అందుకు కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.