వైరల్‌ వీడియో : పాము కాటేసినప్పుడు మనిషి శరీరంలో సరిగ్గా ఇదే జరుగుతుంది

-

మన దేశంలో పాము కాటుకు ఏటా 50-60 వేల మంది మరణిస్తున్నారు.. పాము కాటు వేస్తే..ఆ విషం బాడీలోకి వెళ్తుంది.. నోట్లోంచి నురగ వస్తుంది.. ప్రాణాలు పోతాయి.. విరుగుడు ఇంజక్షన్‌ ఇవ్వకపోతే.. క్షణాల్లోనే అంతా అయిపోతుంది. కానీ పాము విషం లోపలికి వెళ్లి ఏం చేస్తుంది.. అసలు ఏం అవుతుంది..? అది మీకు తెలుసా..? పాము విషం మానవ రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ వీడియోలో క్లియర్‌గా చూపించారు.

ఈ వైరల్ వీడియోలో ఒక ప్రయోగం చేశారు.. పాము మానవ రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ప్రయోగం చూపిస్తుంది. ఈ వైరల్ వీడియోలో, ఒక నిపుణుడు గాజు పాత్రలో పాము విషాన్ని సేకరిస్తున్నట్లు చూడవచ్చు. తరువాత, ఈ విషం ఇప్పటికే నిల్వ చేయబడిన మానవ రక్తంతో నిల్వ చేయబడటం చూడవచ్చు. పాము విషం రక్తంలో కలవడంతో రక్తం గడ్డకట్టడం కనిపిస్తుంది. విషం యొక్క చుక్క మీ రక్తాన్ని ఎంత లోతుగా ప్రభావితం చేస్తుందో వీడియో చూపిస్తుంది.

ఈ వీడియో @cooltechtipz ట్విట్టర్ ఖాతాలో భాగస్వామ్యం చేయబడింది. ఇప్పటికీ 759.3k వ్యూస్‌ వచ్చాయి. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కమెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వీడియో ద్వారా ఒక విషయం అయితే క్లియర్‌గా తెలుస్తోంది.. ఏంటంటే.. ఎప్పుడైతే మనిషిని పాము కాటేస్తుందో.. దాని విషం వల్ల శరీరంలో రక్తం అలా గడ్డకడుతుంది. దాంతో గుండెకు రక్తం సరఫరగా నిలిచిపోతుంది.. విరుగుడు ఇంజక్షన్‌ ఇవ్వకపోతే.. మనిషి ప్రాణం పోతుంది. ఇదంతా కేవలం క్షణాల్లోనే జరుగుతుంది. పాము ఎంత పెద్ద మనిషి అయినా తన విషంతో అంత తేలిగ్గా ప్రాణాలు తీస్తుందా..?

భారతదేశంలో పాముకాటు మరణాలు భారీగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ రిపోర్ట్ వెల్లడించింది. 2000 సంవత్సరం నుండి 2019 సంవత్సరాల వరకూ గత 20 ఏళ్లలో ఏకంగా 12 లక్షల మంది పాముకాటుతో ప్రాణాలు వదిలారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. అంటే ప్రతి సంవత్సరం సరాసరి పాముకాటుకు 58వేల మంది చనిపోతున్నారని, నివేదిక ఆధారంగా ఈ లెక్కలు వెల్లడించినట్లు గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇంకా ప్రభుత్వ లెక్కల్లోకి రాని పాముకాటు మరణాలు దేశంలో పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నట్టు కూడా పేర్కొంది. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో పాముకాటు మరణాలు సంభవిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించింది.

Read more RELATED
Recommended to you

Latest news