నా డ్యూటీ టైమ్ అయిపోయి ఆర్ధగంట అయింది. ఇప్పటికీ ఇంకో డ్రైవర్ రాలేదు.. అటూ డ్రైవర్ ముత్తురాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. లేవల్ క్రాసింగ్ వద్ద ట్రెయిన్ ను ఆపడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఇది నిజంగా విచిత్రమైన సంఘటన బాస్. తన డ్యూటీ టైమ్ అయిపోయిందని.. రైలు డ్రైవర్ ట్రెయిన్ ను మధ్యలోనే ఆపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని శీర్గాలి సమీపంలో చోటు చేసుకున్నది. నేలబొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలు శీర్గాలి సమయంలో సడెన్ గా ఆగిపోయింది. లేవల్ క్రాసింగ్, రైల్వే గేటుకు మధ్యలో రైలును ఆపేసిన డ్రైవర్ ముత్తురాజ్ కిందికి దిగేశాడు.
నా డ్యూటీ టైమ్ అయిపోయి ఆర్ధగంట అయింది. ఇప్పటికీ ఇంకో డ్రైవర్ రాలేదు.. అటూ డ్రైవర్ ముత్తురాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. లేవల్ క్రాసింగ్ వద్ద ట్రెయిన్ ను ఆపడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు.. అక్కడికి చేరుకొని ముత్తు రాజ్ కు నచ్చజెప్పడంతో రైలును స్టార్ట్ చేసి అక్కడినుంచి తీసుకెళ్లాడు. దీంతో భారీగా స్థంభించిన ట్రాఫిక్ కాస్త అప్పుడు క్లియర్ అయింది.