కేసీఆర్‌ బయోపిక్‌ : మా ముఖాల మీద ఊసినవ్.. తాటతీయనీకి వస్తున్నా

-

కేసీఆర్‌ బయోపిక్‌ టైగర్‌ కేసీఆర్‌ చిత్రాన్ని రూపొందించనున్నట్లు రామ్‌ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. టైగర్‌ కేసీఆర్‌ అంటూ పోస్టర్‌ కూడా విడుదల చేశాడు. అయితే టైగర్‌ కేసీఆర్‌ కమింగ్‌ సూన్‌ అంటూ ట్విట్టర్‌లో ఓ పాట పాడి పెట్టాడు ఆర్జీవి. మా భాష మీద నవ్వినవ్… మా ముఖాల మీద ఊసినవ్… మా బాడీల మీద నడిసినవ్ ఆంధ్రోడా… వస్తున్నా… వస్తున్నా… మీ తాటతీయనీకి వస్తున్నా… అంటూ తాను పాడిన వీడియోని పోస్ట్‌ చేశాడు. వర్మ పాటపై వెల్లువెత్తుతున్నాయి. తాట తీస్తాడా..? తీయించుకుంటాడా..? అంటూ కామెంట్లు వస్తున్నాయి.

కేసీఆర్‌ బయోపిక్‌ అంటూ ప్రకటించిన రామ్‌ గోపాల్‌ వర్మ ఉద్దేశ్యం ఏంటో తాను చేసిన ట్వీట్‌ను బట్టి అర్థమవుతుంది. మరోసారి ఆంధ్ర తెలంగాణల మద్య అఘాదం సృష్టించే పనిలో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినేలా పాడిన పాటను ఏ ఒక్కరూ అంగీకరించరు..

Read more RELATED
Recommended to you

Latest news