కరెంట్‌ అఫైర్స్‌పై డిబేట్‌కు వచ్చి లైవ్‌లో కొట్టుకున్న అతిథులు.. వీడియో వైరల్‌

-

న్యూస్‌ డిబేట్‌ ప్రోగ్రామ్స్‌ చూస్తుంటే.. వాళ్లు ఒకరి మీద ఒకరు అనేక ఆరోపణలు చేసుకుంటారు. వాదించుకుంటారు. ఎక్కడ కొట్టుకుంటారో అనిపిస్తుంది. పీక్‌ స్టేజ్‌ వరకూ వెళ్తారు కానీ అది లైవ్‌ షో కాబట్టి, జనాలు చూస్తారు అని ఒకరి మీద ఒకరు దాడి మాత్రం చేసుకోరు. కానీ ఇక్కడ ఓ టీవీలో షోకు ముఖ్యఅతిథిలుగా వచ్చిన ఇద్దరు పిచ్చకొట్టుడు కొంటుకున్నారు. వారిని యాంకర్‌ కంట్రోల్‌ చేయలేకపోయాడు.

ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ న్యూస్‌లో జావేద్ చౌదరి షోలో ఇద్దరు అతిథులు ప్రత్యక్షంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్‌పై సివిల్ డిబేట్ జరిపేందుకు ఇద్దరు ప్రత్యర్థులు వచ్చారు. వారు మాట్లాడుకుంటూనే..వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఒక అతను చైర్‌లోంచి పైకి లేచాడు. అంతే ఇంకొకతను లేచాడు. ఇద్దరు కొట్టుకున్నారు.

ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన పీటీఐ న్యాయవాది షేర్ అఫ్జల్ మార్వత్, పీఎంఎల్-ఎన్ సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్ హోరాహోరీగా పోరాడారు. దివంగత ముషాహిద్ ఉల్లా ఖాన్ కుమారుడు అఫ్నాన్ ఉల్లా ఖాన్ మాజీ ప్రధాని మరియు PTI ఛైర్మన్ యూదుల ఏజెంట్ అని మరియు పాకిస్తాన్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించడంతో ఈ వివాదం పరాకాష్టకు చేరుకుంది.

దీంతో కోపోద్రిక్తుడైన, PTI అధ్యక్షుడి న్యాయ సలహాదారుల్లో ఒకరైన షేర్ అఫ్జల్ మార్వాత్, తన నాయకుడిపై వచ్చిన ఆరోపణలను వినడానికి సిద్దంగా లేక నేరుగా అతన్ని కొట్టబోయాడు. షేర్ అఫ్జల్ తాను షోలో ఉన్నానని మరచిపోయి అఫ్నాన్ ఉల్లా నుదుటిపై కొట్టడంతో అఫ్నాన్ ప్రతీకారం తీర్చుకున్నాడు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫైట్

వీరిద్దరిని శాంతింపజేయడానికి హోస్ట్ జావేద్ చౌదరి తీవ్రంగా ప్రయత్నించాడు, కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరూ ఒకరినొకరు దూషించుకోవడం మొదలుపెట్టారు. ఈ సమయంలో, సిబ్బంది ఇద్దరినీ వేరు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు, ఇవన్నీ షోలో ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. అంతే ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇప్పటికే ఈ వీడియోకు 28.2k వ్యూస్‌ వచ్చాయి. 271 మంది రీపోస్ట్‌ చేశారు. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news