పెళ్ళైన రెండు వారల తర్వాత తన భార్య, అబ్బాయని తెలుసుకున్న భర్త…!

-

ప్రపంచంలో జరిగే కొన్ని కొన్ని వింతలు ఇప్పుడు జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి కావాలని జరుగుతున్నాయో యాదృచ్చికంగా జరుగుతున్నాయో గాని జరుగుతున్న ఘటనలు మాత్రం ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఉగాండాకు చెందిన ఒక వ్యక్తి వివాహం చేసుకున్న రెండు వారాల తర్వాత తాను పెళ్లి చేసుకున్నది అమ్మాయిని కాదని అబ్బాయి అని తెలుసుకుని కంగుతిన్నాడు.

మొహమ్మద్ ముతుంబా మరియు అతని “వధువు”కి రెండు వారాల క్రితం సాంప్రదాయ పద్దతిలో వివాహం జరిగింది. ఇద్దరూ సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారు. అయితే తాను రుతుక్రమంలో ఉన్నానని వధువు చెప్పండంతో వివాహం పూర్తి కాలేదు. తాను ఓపికగా ఎదురు చూస్తాను అని చెప్పగా ఆమె సరే అని వేచి చూసిందని వరుడు చెప్పాడు. అయితే అతను మాత్రం ఒక విషయాన్ని గుర్తించలేకపోయాడు.

కాని పొరుగు వారు గుర్తించి వధువు అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పడంతో షాక్ తిన్నాడు. ఒక టెలివిజన్ సెట్ మరియు బట్టలు, వస్తువులను దొంగిలించడానికి ఆ “భార్య” గోడపైకి దూకిందని ఇమామ్ పొరుగువారు ఆరోపించారు. ఆ తర్వాత వారు మహిళ కాదని నిర్ధారించారు. దీనితో వారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు పోలీసులు. మహిళా పోలీసు అధికారి నిందితుడిని తనిఖీ చేస్తుండగా చూసి షాక్ తింది.

నిందితుడు బ్రాలో బట్టలు పేర్చాడని చూసి ఆమె షాక్ అయ్యారు. తనిఖీ చేస్తున్న సమయంలో నిందితుడికి మగ జననేంద్రియాలు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. తదుపరి విచారణలో, నిందితుడు తన డబ్బు కోసం ఇమామ్ను మోసం చేశాడని ఒప్పుకున్నాడు. అయితే వివాహం పూర్తి అయ్యే వరకు శృంగారం చేయకూడదు కాబట్టి తాను గుర్తించలేకపోయా అని, మసీదు బయట ఆ వ్యక్తి తనకు పరిచయం అని అతనిని చూసి అమ్మాయి అనుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని అతను వాపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news