వైరల్ వీడియో; బాటిల్ మింగిన తాచుపాము…!

-

ప్లాస్టిక్ వాడకం నిషేధించాలి అనే డిమాండ్ రోజు రోజు కి ఎక్కువగా వినపడుతున్న సంగతి తెలిసిందే. అయినా సరే మనం ప్లాస్టిక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీనికారణంగా మనుషులకు ఎంత నష్టం వాటిల్లుతుందో జంతువులకు కూడా అదే స్థాయిలో నష్టం జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం భారత అటవీ సేవా అధికారి పర్వీన్ కస్వాన్ పంచుకున్న ఒక వీడియో చూస్తే ప్లాస్టిక్ ఎంత ప్రమాదామో అర్ధమవుతుంది.

ఒక తాచుపాము ప్లాస్టిక్ బాటిల్ ని మింగేస్తుంది. 48 సెకన్ల వీడియోలో, పాము బాటిల్ ని మింగి కదలలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఆ పాము చుట్టూ కొంతమంది ఉన్నారు. అది ఎటు కదలలేక దానితో తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆ పాముని కర్రతో తట్టగా అది బలవంతంగా ఆ బాటిల్ ని బయటకు కక్కేస్తుంది. వీడియో ఎక్కడ చిత్రీకరించబడిందో స్పష్టంగా తెలియదు.

“వన్యప్రాణులను మరియు ఇతర జాతులను ప్రభావితం చేసే సీసాలు వంటి సింగిల్ వాడకం ప్లాస్టిక్‌ను చూడండి. వీడియో డిస్టర్బ్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. అది తాచు పాము మింగిన వస్తువులను తిరిగి బయటకు విడుదల చేస్తుందని అయన వివరించారు. “ఇతర జంతువులు అలా చేయలేవు. అవి నొప్పితో చనిపోతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news