వైరల్ వీడియో; కోడి గుడ్డు తొక్క తీయడం ఇంత ఈజీనా…!

-

కొంత మందికి ఉడికించిన కోడి గుడ్ల తొక్క తీయడం అనేది కాస్త కష్టం. అర్జెంట్ అయితే వేడి వేడి గుడ్డుని తీయడానికి కాస్త ఇబ్బంది పడతారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ జోష్ ఇస్తుంది. కోడి గుడ్డు తొక్కను తీయడం ఇంత ఈజీనా అనేలా కేవలం పది సెకన్ల లోపే తొక్కను వలిచేసి ఆశ్చర్యపరిచారు.

వీడియోలో, ఒక వ్యక్తి ఒక గ్లాసులో గుడ్డు పెట్టి అతను గాజు గ్లాసుని నీటితో నింపి, ఆపై వేగ౦గా షేక్ చేస్తాడు. అప్పుడు అతను గుడ్డును బయటకు తీస్తాడు, ఆ తర్వాత తొక్క ఈజీగా బయటకు వస్తుంది. యూజర్ జనవరి 6న ఈ వీడియోని పోస్ట్ చేసాడు. అయితే, వీడియోలో కనిపించే నీటి వృధాపై కొంతమంది తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

ఒకవేళ మీరు గమనించడం తప్పినట్లయితే, హాక్ చేసేటప్పుడు వ్యక్తి ట్యాప్ ఆఫ్ చేయలేదు. “గొప్ప ఆలోచన కానీ ట్యాప్ ఆఫ్ చేయండి” అని ఒక వినియోగదారు కామెంట్ చేసాడు. ఏది ఎలా ఉన్నా సరే కోడి గుడ్డు తొక్కను తీయడ౦ ఇంత ఈజీనా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news