కరోనా వైరస్ మొదలైన తర్వాత సోషల్ మీడియాలో అనేక ఫోటోలు వీడియో లు ఎక్కువగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఎవరికి వారుగా సోషల్ మీడియాలో ఫోటోలను వీడియో లను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో జనాలను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత వన్య ప్రాణులకూ సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఒక సింహం పిల్లకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిని వెల్ కం టూ నేచర్ అనే ఖాతా ద్వారా ట్విట్టర్ లో షేర్ చేసారు. టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో తిరుగుతున్న ఒక చిన్న సింహం పిల్లకు సంబంధించిన వీడియో ఇది. దానికి బహుసా రోజుల వయసు ఉండవచ్చు ఏమో.
అది గర్జించడం ఈ వీడియో లో ఉంటుంది. “సెరెంగేటి నేషనల్ పార్క్ లోని ఓ చిన్న సింహం పిల్ల” అనే శీర్షికతో దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. 15 సెకన్ల క్లిప్‌ను ఇప్పటివరకు 60,000 వేల మంది వీక్షించారు. కాగా లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా వన్య ప్రాణులు జనాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే.
This little lion cub in Serengeti National Park pic.twitter.com/8kXAjsALSw
— Welcome To Nature (@welcomet0nature) April 25, 2020