తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఇప్పుడు కేసీఆర్ సర్కార్ చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణాలో కేసులు తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మొన్న 7 కేసులే రాగా నిన్న ఒక్క రోజే 11 కేసులు వచ్చాయి. ఇప్పుడు లాక్ డౌన్ ని కచ్చితంగా అమలు చెయ్యాలని తెలంగాణా సర్కార్ భావిస్తుంది. కేంద్రం ఎం చెప్పినా సరే తాను చేసేది చేస్తా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
రోజు రోజుకి కరోన తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్న ఆయన తగ్గకపోతే మాత్రం ఇంకా కఠిన నిర్ణయాలు అమలు చెయ్యాలని భావిస్తున్నారు. ఒకవేళ మే 3 తర్వాత లాక్ డౌన్ ని కేంద్రం ఎత్తేసినా సరే రాష్ట్రాల సరిహద్దులను మాత్రం అనుమతించేది లేదని ఆయన అధికారులకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఎవరు చెప్పినా సరే ఎవరూ కూడా రాష్ట్రంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పారట.
హైదరాబాద్ లోకి ఎవరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి రాకుండా చూడాలని ఆయన హెచ్చరించారు. అత్యవసర సరుకులు మాత్రమే హైదరాబాద్ రావాలి గాని ఏ ఒక్కరు కూడా అనవసరంగా నగరంలోకి రావొద్దని ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే సూర్యాపేట జిల్లా సరిహద్దులను కూడా పూర్తిగా మూసి వెయ్యాలని, పంట పొలాల్లో కొందరు ఏపీ నుంచి వచ్చే అవకాశం ఉందని ఎవరూ రావొద్దని కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.