వైరల్ వీడియో; ఏనుగును ఆపడానికి ఏం చేస్తున్నాడో చూడండి…!

-

ఈ మధ్య జనావాస ప్రాంతాల్లో ఏనుగులు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తూ చుక్కలు చూపిస్తున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. జనావాస ప్రాంతాల్లోకి వచ్చి పంట పొలాలను కూడా నాశనం చేస్తున్నాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో అయితే వీటి విధ్వంశం అంతా ఇంతా కాదు. చివరికి రెస్టారెంట్ కిచెన్ లోకి కూడా వస్తూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా ఇలాగే పశ్చిమ బెంగాల్ లో ఒక ఏనుగు జనావాస ప్రాంతాల్లోకి వచ్చేసింది. దీనితో అక్కడి గ్రామస్తులు దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేసారు. అది ఆ ప్రాంతంలో కాస్త నాశనం కూడా చేసి ప్రజలకు చుక్కలు చూపించింది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

అడవుల్లోకి వెళ్ళిపోతున్న ఒక ఏనుగుని తోక పట్టుకుని వెనక్కు లాగుతూ ఉంటాడు. ఆ ఏనుగు ముందుకి వెళ్ళిపోతున్నా సరే అతను ఆగలేదు. అంత బలమైన ఏనుగుని అతను వెనక్కు లాగడం ఆశ్చర్యంగా మారింది. అక్కడ ఉన్న వాళ్ళు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పక్కన ఉన్న వాళ్ళు వద్దని వారిస్తున్నా సరే అతను వెనక్కు తగ్గలేదు. దీనిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news