ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈడెన్ పార్క్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉందన్న ఉద్దేశంతోనే టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలిసింది. భారత్ గడ్డపై ఇటీవల వన్డేల్లో ఆస్ట్రేలియాని 2-1 తేడాతో ఓడించిన టీమిండియా.. అదే జోరుని కివీస్ గడ్డపైనా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు గత ఏడాది ఇలానే పర్యటనకి వచ్చిన భారత్ జట్టుని మూడు టీ20ల సిరీస్‌లో 2-1 తేడాతో ఓడించిన న్యూజిలాండ్.. మరోసారి అదే దూకుడుని ప్రదర్శించాలని ఆశిస్తోంది.
ఇదిలా ఉంటే.. భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊహించని మార్పులు చేశాడు. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని టీమిండియా జట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. ధవన్, పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ గాయాలతో దూరం కావడం టీమిండియా జట్టును కలవరపెడుతోంది. ప్రస్తుతం భారత్ తుది జట్టులో..విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్ధూల్ ఠాకూర్ ఆడుగున్నాడు.