వ‌య్యారి వార‌ధి ఎక్క‌డ ఉందో తెలుసా.. దాని స్పెషాలిటీస్ తెలిస్తే…!

-

  1. స‌హ‌జంగా చాలా మంది అనేక ర‌కాల బ్రిడ్జ్‌లు చూసే ఉంటారు. కానీ.. ఈ వింతైన.. విచిత్ర‌మైన బ్రిడ్జ్ మీరు చూసుండ‌రు. దీని స్పెషాలిటీస్ ఎంటో తెలిస్తే భలే చిత్రంగా ఉంటుంది. వంపుల వంపుల వంతెన, వ‌య్యారి వంతెన, విడిపోయే వంతెన ఎక్క‌డ ఉంది? దాని పేరేంటో తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి..
Where is Gateshead Millennium Bridge
Where is Gateshead Millennium Bridge

అదే గేట్స్‌హెడ్ మిలీనియం వంతెన. ఇది న్యూకాజిల్ మరియు గేట్స్‌హెడ్ మధ్య టైన్ నదిపై ఉంది. విచిత్ర‌మైన, వింతైన ఈ వంతెన‌ మొట్టమొదట 17 సెప్టెంబర్, 2001 న ప్రారంభించారు. అప్పటినుండి పాదచారులకు మరియు సైక్లిస్టులకు వంపైన వంతెన‌. దీని పొడ‌వు 105 మీట‌ర్లు. అలాగే ఈ వంతెన కింత నీళ్లలో పడవలు కూడా ప్ర‌యాణం చేస్తాయి. వంతెన అడ్డు వ‌స్తుంది క‌దా! అని అనుకుంటున్నారా. కానీ అప్పుడే ఈ వంతెన ఒక్కసారిగా పైకి వెళ్లి ఆర్చ్‌లా అవుతుంది. మళ్లీ పడవలు వెళ్లాక కిందికి వంగిపోయి మామూలు బ్రిడ్జ్‌లా మారిపోతుంది.

ఇది ఎలా సాధ్యం అంటే.. వాస్త‌వానికి ఈ వంతెనను రెండు భాగాలుగా నిర్మించారు. ఈ రెండింటిని కలుపుతూ ఆరు మీటర్ల పొడవైన స్టీలు తీగలు అమ‌ర్చి ఉంటాయి. వీటి సాయంతోనే ఇదీ పైకీ కిందకీ ఆర్చ్‌లా మారుతూ ఉంటుంది. ఇది క‌దిలే వంతెన‌ల్లో ఒక‌టి అని చెప్పాలి. ఇదే ఈ బ్రిడ్జ్‌ స్పెషాలిటీ. 2005 లో, వంతెన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్రిడ్జ్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నుండి అత్యుత్తమ నిర్మాణ పురస్కారాన్ని కూడా పొందింది. చూడ‌డానికి క‌నుల‌విందుగా మ‌రియు ప్ర‌యాణానికి సౌక‌ర్యంగా ఉండే ఈ బ్రిడ్జ్ ముసుకుంటూ తెరుచుకుంటూ అంద‌రిని ఆక‌ర్షిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news