తేనెటీగ‌ ల తెట్టెను జాగ్ర‌త్త‌గా తొల‌గించిన మ‌హిళ‌.. వైర‌ల్ వీడియో..!

తేనెటీగ‌లు పెట్టుకునే తెట్టెను తొలగించ‌డం అంత సుల‌భంగా సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. పూర్తిగా నాశ‌నం చేయ‌డం సుల‌భ‌మే. కానీ ఆ తెట్టెను ఒక చోట నుంచి ఇంకో చోటుకు త‌ర‌లించ‌డం మాత్రం చాలా క‌ష్టంగా ఉంటుంది. కానీ ఆ మ‌హిళ మాత్రం సునాయాసంగా ఆ ప‌నిచేసింది. ఆమె తేనెటీగ‌ల తెట్టెను చాలా జాగ్ర‌త్త‌గా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మార్చింది.

ఎరికా థామ్స‌న్ అనే మ‌హిళ ప్రొఫెష‌న‌ల్ బీకీప‌ర్‌. తేనెటీగ‌ల పెంప‌కంలో ఆరి తేరింది. ఆమె ఉండేది టెక్సాస్‌లో. అయితే ఇటీవ‌ల ఆమెకు ఓ అపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్ద‌రు ఫ్లాట్ ఓన‌ర్స్ త‌మ ఫ్లాట్స్ వ‌ద్ద సీలింగ్‌కు ఉన్న తేనెటీగ‌ల తెట్టెను తొల‌గించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో స్పందించిన ఎరికా వారి ఫ్లాట్స్ వ‌ద్ద‌కు వ‌చ్చి ఆ తెట్టెను సుల‌భంగా తొల‌గించింది. తెట్టెను ఆ ఫ్లాట్ ఓన‌ర్స్ నాశ‌నం చేసే వారే. కానీ వారు అలా చేయ‌లేదు. వాటిని ఇంకో చోటుకు త‌ర‌లించాల‌ని కోరారు. దీంతో ఎరికా వాటిని అక్క‌డి నుంచి తీసి ఇంకో చోటుకు మార్చింది.

ఇక ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తేనె తెట్టెను జాగ్ర‌త్త‌గా తీస్తున్న ఆమె స్కిల్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ వీడియోకు ఇప్ప‌టికే 20 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. చాలా మంది నెటిజ‌న్లు ఆ వీడియోకు ర‌క ర‌కాల కామెంట్లు పెడుతున్నారు. తేనె తెట్టెను నాశ‌నం చేయ‌కుండా ఇంకో చోటుకు మార్చారు, గ్రేట్‌.. అంటూ ఆమెను అభినందిస్తున్నారు.