ఔరంగాబాద్‌కు చెందిన ఓ మహిళ తన ఏడేళ్ల కూతురుతో కలిసి మార్చి 25న షాపింగ్‌కు వెళ్లింది. షాపింగ్ పూర్తయ్యాక.. షేరింగ్ ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ.. చీకటి కావడంతో ఆటోలు రాలేదు.
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. శిక్షలు పెంచినా రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. వాటికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. అయితే.. ఎవరైనా మనపైన దాడి చేసేటప్పుడు మనం కొంచెం తెలివిని ప్రదర్శిస్తే వారి బారి నుంచి తప్పించుకోవచ్చని నిరూపించింది ఓ మహిళ. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటు చేసుకున్నది.
ఔరంగాబాద్‌కు చెందిన ఓ మహిళ తన ఏడేళ్ల కూతురుతో కలిసి మార్చి 25న షాపింగ్‌కు వెళ్లింది. షాపింగ్ పూర్తయ్యాక.. షేరింగ్ ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ.. చీకటి కావడంతో ఆటోలు రాలేదు. దీంతో ఓ బైకర్‌ను ఆ మహిళ లిఫ్ట్ అడిగింది. దీంతో ఆ బైకర్.. ఆ మహిళ, తన కూతురును బైక్ ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లాక.. అతడిలో కొరిక పురివిచ్చుకుంది. నిర్మానుష్య ప్రాంతం వద్దకు రాగానే బైక్‌ను ఆపాడు. ఆమెను దింపి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆ మహిళ అతడిని అడ్డుకోబోగా.. తన దగ్గర ఉన్న కత్తితో ఆమెను బెదిరించి అత్యాచారం చేయబోయాడు.
దీంతో వెంటనే తనకు హెచ్‌ఐవీ పాజిటివ్ అని.. ఎయిడ్స్ ఉందని.. ఆ దుండగుడికి చెప్పింది మహిళ. దీంతో ఆ కామాంధుడు దెబ్బకు కత్తిని అక్కడ పడేసి బైక్‌పై వెళ్లిపోయాడు. వెంటనే తేరుకున్న బాధితురాలు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పింది. అతడి చేతులపై టాటూలు కూడా ఉన్నాయని అతడి గురించి వివరాలు చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఆ దుండగుడు.. 22 ఏళ్ల కిషోర్ విలాస్‌గా గుర్తించి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి దుండగుడి బారి నుంచి తప్పించుకున్న మహిళను పోలీసులు అభినందించారు. మహిళలు ఆపత్కాల సమయంలో ఇలాగే సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.