మహిళల్లో ఈ లక్షణాలు వుండకూడదు.. లేదంటే ముప్పే..!

ఆచార చాణక్య చెప్పినట్లుగా మనం నడుచుకుంటే ఖచ్చితంగా మన జీవితం బాగుంటుంది. మన జీవితాన్ని మార్చుకొని అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కచ్చితంగా చాణక్య చెప్పిన విషయాలని గుర్తు పెట్టుకొని ఆచరించాలి. ఇలా పాటిస్తే జీవితం బాగుంటుంది. మనలో తెలియని చిన్న చిన్న గుణాలు, మన తత్వం, అలవాట్లు సమస్యలను తీసుకు వస్తాయి.

ఒక్కొక్కసారి మనలో ఉండే చెడు గుణాలని కనిపెట్టి వాటిని లేకుండా చూసుకుంటే మన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆచార్య చాణక్య మహిళల్లో ఈ గుణాలు అస్సలు ఉండకూడదని అంటున్నారు మరి ఎటువంటి గుణాలు మహిళల్లో ఉండకూడదు..?, వీటి వలన సమస్యలు వస్తాయి అనే విషయాన్ని చూద్దాం. చాణక్య ప్రకారం ఈ మూడు అలవాట్లు స్త్రీకి అసలు ఉండకూడదు.

అబద్దం ఆడడం:

అబద్దం ఆడడం ఎవరికీ మంచిది కాదు. అందులోను స్త్రీ అస్సలు చెప్పకూడదు. ‘అనృతాన్ సాహసం మయా మూర్ఖత్వం’ అన్నారు. అంటే ఈ అలవాటు ఉంటే ఆ అబద్దాల వలన వాళ్లే
చిక్కుకుపోతారని అన్నారు చాణక్య.

వాదించడం:

భర్త తో ఏ భార్యా కూడా వాదించకూడదు. పైగా భర్త తో గట్టిగ అరచి మాట్లాడడం వంటివి చెయ్యకూడదు. ఇలా చేస్తే కూడా కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది. కనుక అలా వద్దు.

అనారోగ్య సమస్యలను దాచేయడం:

మహిళలు తరచుగా వారి అనారోగ్య సమస్యలని దాచేస్తూ వుంటారు. కానీ అలా చెయ్యకూడదు. అనారోగ్య సమస్య కోసం చెబుతూ ఉండాలి. లేదంటే మీరే వ్యాధులను అభివృద్ధి చేస్తూ వుంటారు. అది ఇంకా ప్రమాదం.