మాన‌వాళికి ఏసుక్రీస్తు చెప్పిన 7 అద్భుత‌మైన వాక్యాలు ఇవే..!

-

క్రైస్తవులు త‌మ ఆరాధ్య దైవం క్రీస్తు పుట్టిన రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25వ తేదీన క్రిస్మ‌స్ పండుగ‌ను జ‌రుపుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను వారు ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఇక చ‌ర్చిల్లో క్రైస్త‌వులు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేస్తారు. అలాగే ఆ రోజు క్రీస్తు శిలువ వేయ‌బ‌డిన‌ప్పుడు అన్న మాట‌ల‌ను వారు గుర్తు చేసుకుంటారు. అయితే శిలువ‌పై ఉన్న క్రీస్తు నిజానికి క్రైస్త‌వుల‌కే కాదు, ప్ర‌పంచానికి కూడా ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన 7 వాక్యాలు చెప్పాడు. అవేమిటంటే…

 

* తోటి వారిని ప్రేమించండి. వారిపై కోపం, అసూయ‌, ఈర్ష్య ప్ర‌ద‌ర్శించ‌కండి. స‌మాజంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ ప్రేమించండి. నేను మిమ్మ‌ల్ని ప్రేమించిన‌ట్లే మీ ప్రేమ‌ను ఇత‌రులకు పంచండి.

* నీ శత్రువునైనా స‌రే నువ్వు ప్రేమించాలి. వారి కోసం అవ‌స‌ర‌మైతే దేవున్ని కూడా ప్రార్థించాలి. వారికి నీ చేత‌నైనంత స‌హాయం చేయాలి.

* నువ్వు చేసిన త‌ప్పుల‌కు ప‌శ్చాత్తాప‌ప‌డు. విచారించు. అవ‌స‌రం అయితే ఎదుటివారికి క్ష‌మాప‌ణ చెప్పు. అందులోనే నిజ‌మైన స్వ‌ర్గం ఉంటుంది.

* దేవున్ని న‌మ్మండి. మీకు ఎలాంటి ప్ర‌మాదాలూ రావు.

* తప్పు చేసిన వారిని క్ష‌మించండి.

* సమస్త మానవాళి పట్ల ప్రేమ క‌లిగి ఉండండి. నిస్సహాయుల పట్ల కరుణ చూపించండి.

* శత్రువుల పట్ల క్షమా గుణం క‌లిగి ఉండండి. సహనం, త్యాగం ప్ర‌ద‌ర్శించండి.

Read more RELATED
Recommended to you

Latest news