క్రిస్మస్ ట్రీలను అలంకరిస్తారు ఎందుకు? ఎప్పటి నుంచి ప్రారంభమైంది..?

-

ప్రతి ఏటా డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ సమీపిస్తుందంటే చాలు.. క్రైస్తవులు పండుగ వేడుకల్లో మునిగిపోతుంటారు. ఇండ్లను అందంగా అలంకరించుకుంటుంటారు. ముఖ్యంగా క్రిస్మస్ రోజు క్రిస్మస్ ట్రీని విద్యుత్ అలంకరణ దీపాలతో ముస్తాబు చేస్తారు. అయితే క్రిస్మస్ రోజున క్రిస్మస్ ట్రీని ఎందుకు అలంకరిస్తారో, అసలు ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసా..? అవే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

why christians decorate christmas tree

క్రిస్మస్ రోజున క్రిస్మస్ ట్రీని అలంకరించడం మొదటగా జర్మనీలో 15వ శతాబ్దంలో ఆరంభమైందని చెబుతుంటారు. లివోనియాలో మొదటగా క్రిస్మస్ ట్రీని అలంకరించి ఉంటారని చరిత్రకారులు చెబుతుంటారు. కాగా 1781లో ఈ విధానం అప్పటి బెన్షివిక్ సైనికుల ద్వారా కెనడాకు వ్యాపించిందని అంటుంటారు. సైనికాధికారి జనరల్ ఫెడరిక్ అడాల్ఫ్ రెడిజిల్ ఇచ్చిన క్రిస్మస్ విందులో అథితులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేందుకు అప్పట్లో అతను క్రిస్మస్ ట్రీని అలంకరించాడట. కొవ్వుత్తులు, పండ్లతో ఆ ట్రీని అలంకరించారట. ఇక 19వ శతాబ్దంలో ఈ సంప్రదాయం ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. రష్యాలో ఒకప్పుడు కేవలం ధనికులు మాత్రమే తమ తమ ఇళ్లలో క్రిస్మస్ ట్రీలను అలంకరించేవారు.

ఇక 1816లో నస్సావో-విల్‌బర్గ్ యువరాని హెన్‌రేటా పేరిట క్రిస్మస్ ట్రీని తయారుచేసి దాన్ని వియాన్న దేశవాసులకు చూపించిందట. దీంతో ఈ సంప్రదాయం ఆ తరువాత ఆస్ట్రియాకు విస్తరించిందట. 1840లో ఫ్రాన్స్‌లో క్రిస్మస్ ట్రీ అలంకరణలు ప్రారంభించారు. 19వ శతాబ్దంలో బ్రిటన్ రాణి విక్టోరియా తన రాజ్య భవనంలో ఓ క్రిస్మస్ ట్రీని అందంగా ముస్తాబు చేయించిందట. దీంతో చాలా మంది క్రిస్టియన్లు అప్పటి నుంచి క్రిస్మస్ ట్రీలను అలంకరించడం మొదలు పెట్టారు. ఆ తరువాత మార్టిన్ లూథర్ క్రిస్మస్ ట్రీకి విద్యుత్ అలంకరణ దీపాలను పెట్టి అలంకరించడంతో తరువాత అదే సంప్రదాయాన్ని చాలా మంది అప్పటి నుంచి పాటిస్తూ వస్తున్నారు.

అయితే క్రిస్మస్ ట్రీ ఆనందానికి, ఐశ్యర్యానికి, పచ్చదనానికి చిహ్నంగా నిలుస్తుందట. అందుకనే చాలా మంది ఆ ట్రీని క్రిస్మస్ రోజు అలంకరిస్తే తమను దేవుడు అనుగ్రహించి తమకు సిరిసంపదలు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని నమ్ముతారు. అందుకే క్రిస్టియన్లు క్రిస్మస్ రోజున క్రిస్మస్ ట్రీలను సుందరగా ముస్తాబు చేస్తుంటారు. ఇక ఆ ట్రీని అలంకరించడం ద్వారా ఇతరులను ప్రేమించడం, క్షమించడం అనే గుణాలను కలిగి ఉన్నామని ఇతరులకు తెలియపరుస్తున్నట్లు కూడా అర్థం వస్తుందట. అందుకనే ఆ ట్రీని క్రైస్తవులు అలంకరిస్తుంటారు..!

Read more RELATED
Recommended to you

Latest news