ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ వరకూ 9 రోజులు రోజుకో నైవేద్యం…ఏ రోజు ఏం పెట్టాలంటే…!

-

అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు జరుపుకునే పుష్పవల్లుల పండుగ “బతుకమ్మ పండుగ”. బతుకమ్మ పండుగకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. మార్కండేయ పురాణం గాథా సప్తశతి లోని ఒక కథ ప్రకారం, మహిషాసురుని సంహరించి బాగా అలసిపోయిన గౌరీదేవి అశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున నిద్రించి దశమినాడు మేల్కొంటుంది. అయితే తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో అమ్మవారికి ఏ రోజు ఏం నైవేద్యం పెడతారో చూద్దాం.

#1 ఎంగిలిపూల బతుకమ్మ: మహాలయ అమావాస్య రోజున మొదలవుతుంది. ఈ రోజున నువ్వులు, బియ్యం, పిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

#2 అటుకుల బతుకమ్మ: అశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అటుకులను ఈరోజు వాయనంగా ఇస్తారు.

#3 ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లం తో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

#4 నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

#5 అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోష నైవేద్యంగా సమర్పిస్తారు.

#6 అలిగిన బతుకమ్మ: ఈరోజు అశ్వయుజ పంచమి. నైవేద్యం ఏమి సమర్పించారు.

#7 వేపకాయల బతుకమ్మ: బియ్యప్పిండిని బాగా వేయించి వేప పండ్లు గా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

#8 వెన్నెముద్దల బతుకమ్మ : నువ్వులు వ

వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

#9 సద్దుల బతుకమ్మ: అశ్వయుజ అష్టమి రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు. ఈరోజు ఐదు రకాల నైవేద్యాలు తయారుచేస్తారు. పెరుగు అన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం.

Read more RELATED
Recommended to you

Latest news