దీపావళికి ఈ స్వీట్స్ తో నోరు తీపి చేసుకోండిలా..

-

మన దేశంలో ఎక్కువ మంది జరుపుకునే పండుగలలో దీపావళి కూడా ఒకటి..ఈ పండుగను అందరు తమ కుటుంబ సభ్యులతో బంధువులతో చేసుకోవాలని అనుకుంటారు.దీపావళి రోజు కచ్చితంగా నోరు తీపి చేసుకోవాల్సిందే. అలాగే ఇంటికొచ్చే అతిధులకు స్వీట్లు పంచాల్సిందే. ఆ స్వీట్లు కొని తెస్తే ఏం బావుంటుంది, ఇంట్లోనే మీరు టేస్టీగా వండి పెడితే ఆ ఆనందమే వేరు.అయితే ఎలాంటి స్వీట్ చెయ్యాలని అనుకొనెవారు వీటిని మీ ఇంట్లో ట్రై చెయ్యండి..

కలాకండ్:

కావాల్సిన పదార్థాలు
క్రీమ్ మిల్క్ -ఒక లీటరు
పంచదార – వంద గ్రాములు
యాలకుల పొడి – అరస్పూను
నెయ్యి – ఒక టీస్పూను
నిమ్మరసం – రెండు టీస్పూన్లు

తయారీ విధానం..

1. ఒక కళాయిలో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్‌ను చిన్న మంట మీదే ఉంచాలి.
2. పాలును అలా చిన్న మంట మీదే మగ్గిస్తూ ఉంటే సగానికి పైగా ఆవిరై అరలీటరు చిక్కని పాలగా మారుతాయి.
3. ఇప్పుడు నిమ్మరసాన్ని కలిపితే పాలు విరిగిపోతాయి.
4. ఆ పాలలో పంచదారను కూడా వేసి అలా ఉడికించాలి.
5. ఆ మిశ్రమం అంతా చిక్కగా మారేవరకు అలా మగ్గించాలి.
6. అందులో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
7. కలాకండ్‌లా చిక్కగా మారాక స్టవ్ కట్టేయాలి.
8. ప్లేటుకు నెయ్యి రాసి వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి.
9. కాస్త గట్టిపడ్డాక ముక్కలుగా కోసుకోవాలి.
10. అంతే అదిరిపోయే టేస్ట్‌తో కలాకండ్ రెడీ..

పాలపొడి బర్ఫీ:

కావాల్సిన పదార్థాలు

పాల పొడి -ఒక కప్పు
పంచదార పొడి – పావు కప్పు
నెయ్యి – అరకప్పు
నట్స్ – సన్నగా తరిగినవి

తయారీ విధానం..

1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
2. ఆ నెయ్యిలో పాలపొడి వేసి ఉండలు చుట్టకుండా కలుపుతూనే ఉండాలి.
3. అందులో పంచదార పొడి కూడా వేసి కలుపుతూనే ఉండాలి.
4. అది చిక్కగా అయ్యే వరకు చిన్న మంట మీద ఉంది కలుపుతూనే ఉండాలి.
5. చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
6. ప్లేటుకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేసి పైన నట్స్ తరుగును చల్లుకోవాలి.
7. బర్ఫీల్లా కట్ చేసుకోవాలి. పాలపొడి బర్ఫీ రెడీ అయ్యింది..

Read more RELATED
Recommended to you

Latest news