Holi 2022: హోలీ పండుగని ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా..?

-

హోలీ పండుగని ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటాము. హోలీ ఆనందాల డోలిక అంటారు. అయితే హోలీని అంతా జరుపుకుంటూ వుంటారు కానీ అసలు ఈ హోలీని ఎందుకు జరుపుకుంటారు అనే దాని గురించి చాలా మందికి తెలియదు. మరి అసలు ఎందుకు హోలీ చేసుకోవాలి అనేది చూసేద్దాం.

 

నిత్యం విష్ణు మూర్తిని రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే అది ఏ మాత్రం హిరణ్యకశపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని అనుకుంటాడు. అందుకని అతని రాక్షస సోదరి హోళికను రమ్మని చెబుతాడు. ఆ తరవాత ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని కోరడం జరుగుతుంది. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడి లో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రహ్లాదుడు మాత్రం విష్ణు మాయ తో ప్రాణాల తో బయట పడడం జరుగుతుంది. హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే ‘హోలీ’ అని అంటారు. కొన్ని చోట్ల అయితే ‘హోలిక’ దహనం చేసి రంగులను జల్లుకుంటారు. ఇక ఇది ఇలా ఉంటే వంగ దేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో జరుపుతారు.

Read more RELATED
Recommended to you

Latest news