RRR : ఆర్ఆర్ఆర్ సినిమాకు U/A సెర్టిఫికేట్.. ర‌న్ టైం ఎంతంటే..?

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నంద‌మూరి హీరో తార‌క్ మ‌ల్టీ స్టార‌ర్ గా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కు దేశంలోనే గొప్ప డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగ ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా రెంజ్ లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.

కాగ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్, తార‌క్, రాజ‌మౌళి ఈ సినిమా ప్ర‌మోషన్స్ బిజీ లో ఉన్నారు. ప్ర‌మోషన్స్ లో భాగంగా దేశం మొత్తం చుట్టి రావాల‌ని కూడా ప్లాన్ చేస్తున్నారు. రేప‌టి నుంచి ఈ నెల 23 వ‌ర‌కు ఏడు రోజుల్లో ఏకంగా 9 న‌గ‌రాల్లో ప‌ర్య‌టించాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. కాగ ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ వ‌చ్చింది.

ఈ సినిమా కు సెన్స‌ర్ U/A సెర్టిఫికేట్ అందించింది. కాగ ఈ సినిమా ర‌న్ టైం గురించి కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగ ఈ సినిమా ర‌న్ టైం కూడా వ‌చ్చేసింది. ఈ సినిమా ర‌న్ టైం 3 గంట‌ల 6 నిమిషాలు ఉంటుంది. దీనికి సంబంధించిన సెన్స‌ర్ సెర్టిఫికెట్ కూడా సోషల్ మీడియాలో చెక్క‌ర్లు కొడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news