రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

-

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు చేస్తూ ప్రార్థనలు చేస్తుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదవ నెలగా రంజాన్ నెల వస్తుంది. ఇస్లాం నమ్మకం ప్రకారం ఈ నెలలో నరకం గేట్లు మూసివేయబడి, స్వర్గం గేట్లు తెరుచుకునే ఉంటాయి. అందువల్ల ఈ నెలలో పేదలకు సాయం చేయాలని చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ అల్లాకి ప్రార్థనలు చేస్తూ కఠిన ఉపవాస దీక్షలతో రంజాన్ నెల జరుపుకుంటారు.

ఐతే ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో మతపరమైన ఉత్సవాలకి ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రంజాన్ నెల ప్రారంభమయిన సందర్భంగా మీ స్నేహితులతో కొటేషన్లని పంచుకోండి.

మనకున్న అన్ని చెడు అలవాట్లని ఈ రంజాన్ నెల తొలగిస్తుందని నమ్ముతూ, రంజాన్ నెల శుభాకాంక్షలు.

ఇంతకుముందు చేసిన అన్ని పాపాలను అల్లా క్షమిస్తాడని అనుకుంటూ.. రంజాన్ నెల శుభాకాంక్షలు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు అల్లా ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ.. రంజాన్ నెల శుభాకాంక్షలు.

కఠిన ఉపవాస దీక్షలు మీలో పట్టుదలని పెంచి, జీవితంలో అనుకున్న దాన్ని సాధించడానికి కావాల్సిన బలాన్ని అందించాలని కోరుకుంటూ.. రంజాన్ నెల శుభాకాంక్షలు.

ఈ నెలంతా ఉండే పవిత్రత మీ జీవితంలో ఎప్పటికీ ఉండాలని, రంజాన్ నెల మీ జీవితాన్ని కొత్త కోణంలో చూపించి, మీరనుకున్న కలల్ని సాధించే దిశగా సాగించాలని అనుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులకు రంజాన్ నెల శుభాకాంక్షలు.

Read more RELATED
Recommended to you

Latest news