Sri Rama Navami: శ్రీరామనవమి రోజు పొరపాటున కూడా చెయ్యకూడని పనులు ఏవో తెలుసా?

-

తెలుగు పండుగలలో ఒకటి శ్రీరామనవమి… భారతీయులు ఈ పండుగను ఘనంగా చేసుకునే పండుగ..పుష్య నక్షత్రంలో చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మించారు.. ఈరోజున స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చెయ్యడంతో పాటు స్వామివారికి కళ్యాణం కూడా చేస్తారు.ఆ రోజంతా ప్రతి గ్రామాలలో ప్రతి రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ను జరిపిస్తారు గ్రామ పెద్దలు. ఇక వీరి వివాహానికి ఊరి జనాలంతా అతిధులుగా వచ్చి సంబరాలు జరుపుకుంటారు. ఆరోజు రాత్రి శ్రీరాములవారిని, సీతమ్మ తల్లిని పల్లకిలో ఊరంతా ఊరేగిస్తారు. ఇక శ్రీరామనవమి రోజు చాలామంది ఉపవాసం కూడా చేస్తారు.

అలా చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా అయోధ్యలో సరయు నదిలో పుణ్యస్నానాలు కూడా చేయటం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. ఇతర నదులలో కూడా స్నానం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక రామ చరిత, శ్రీరామరక్ష స్తోత్రాన్ని పటించటం, రామకీర్తనలు, భజనలు చేయటం వల్ల పుణ్యం కలుగుతుంది..భజనలు చేస్తారు..పెళ్లి కానీ వాళ్లకు శ్రీరామనవమి ఘడియలు కలిసొస్తాయని.. దీనివల్ల వారికి వెంటనే పెళ్లిళ్లు జరుగుతాయని కొన్ని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఇక ఈ పవిత్రమైన రోజున ఎవరిని ఎవరు మోసం చేయకుండా చిత్తశుద్ధితో ఉండాలి.. అప్పుడే రాముడి అనుగ్రహం ఉంటుందని భక్తులు నమ్ముతారు..

అయితే ఈ రోజున కొన్నిపనులను పొరపాటున కూడా చెయ్యొద్దని చెబుతున్నారు, అవేంటో ఒకసారి తెలుసుకుందాం పదండీ..ఆరోజు ముఖ్యంగా మాంసాహారం ను, మద్యం ను తీసుకోకూడదు. వండే కూరలలో ఉల్లిపాయలు, వెల్లుల్లి అస్సలు వేయకూడదు. జుట్టు కత్తిరించడం, షేవింగ్ చేయటం వంటివి కూడా మంచిది కాదు. ఆరోజు ఇతరులను విమర్శించకుండా ఏదైనా ప్రశాంతంగా చెప్పేలా చూసుకోవాలి.అన్నిటికన్నా ముఖ్యంగా ఇతరులకు ద్రోహం చెయ్యకూడదు.. ఇది అస్సలు మర్చిపోకండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version