శోభకృత్ నామ సంవత్సరం విషెస్: ఈ ఉగాది నాడు స్నేహితులకి, కుటుంబసభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి..!

-

ఉగాది నాడు చాలా రకాల పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటాము. ఉగాది పచ్చడి చేసుకోవడం ఆరోజు పూజ చేసుకోవడం. తులసి చెట్టుకి ప్రత్యేకంగా పూజ చేయడం… లక్ష్మీ దేవి కి విష్ణు మూర్తి కి తులసి మాల సమర్పించేసి పూజ చేయడం ఇలాంటివి ఎన్నో మనం ఆచరిస్తూ ఉంటాము.

అలానే పూజ పూర్తయిన తర్వాత మన మనసు లోని కోరికని దేవుడికి చెప్పి ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాము. ఉగాది పండుగ ని కేవలం మన రాష్ట్రాల్లోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా జరుపుతూ ఉంటారు. కానీ వేరు వేరు పేర్లతో ఉగాది పండుగనే జరుపుతూ ఉంటారు. తమిళనాడు కర్ణాటకలో కూడా ఉగాది చేస్తారు ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి 22న వచ్చింది.

ఈ సందర్భంగా మీరు విషెస్ ని తెలపాలంటే మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఈ మెసేజ్లు ని పంపకుని ఆనందంగా విష్ చేయొచ్చు. చాలామందికి ఉగాది పండుగ శుభాకాంక్షలని ఎలా చెప్పాలి అనేది తెలియదు ఈ కింద కొటేషన్స్ ద్వారా మీరు ఉగాది విషెస్ చెప్పుకోవచ్చు.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా మనం మెసేజ్లు పంపుకుంటున్నాం పండుగ అయినా లేదంటే ఏదైనా ముఖ్యమైన రోజు అయినా చిన్న టెక్స్ట్ మెసేజ్ ద్వారా విషెస్ ని పంపిస్తున్నాము. ఉగాదికి కూడా మీరు ఈ కోట్స్ తో విష్ చేసుకోవచ్చు…

ఆనందంగా.. ఆరోగ్యంగా గడుపుదాం.. కొత్త సంవత్సరం శుభం కలగాలని కోరుకుందాం….
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

బాధలేమి లేకుండా… మీ ఇంట్లో అందరు ఆనందంగా ఉండాలని కోరుతూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

వసంతం మీ ఇంట రంగవల్లులు అద్దాలి.. కోకిల మీ అతిథిగా రావాలి.. కొత్త చిగురులు ఆశల తోరణాలు కట్టాలి… హ్యాపీ ఉగాది.

షడ్రుచుల సమ్మేళన జీవితం.. కష్ట,సుఖం, పాపం, పుణ్యం, మంచి, చెడుల కలయిక ఈ జీవితం…. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ… ఉగాది శుభాకాంక్షలు..

తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

Read more RELATED
Recommended to you

Latest news