ఉదయాన్నే బెల్లం తింటే ఈ లాభాలు పొందొచ్చు..!

బెల్లం (  Jaggery ) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. కేవలం రుచి మాత్రమే కాదు దీనిలో మెడిసినల్ గుణాలు కూడా ఉంటాయి. ఏడాది పొడుగునా దీనిని ఉపయోగించవచ్చు. దీనివల్ల ఐరన్ అందుతుంది.

Benefits of jaggery

 

అదే విధంగా హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్లకి ఎంతో బాగా సహాయం చేస్తుంది. ఎర్ర రక్త కణాలని అభివృద్ధి చేస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు బెల్లం ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

ప్రతి రోజు ఉదయాన్నే 50 గ్రాముల బెల్లం తీసుకుంటే ఎంతో మంచిది. అయితే బెల్లం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కడుపు నొప్పి సమస్యలను తొలగిస్తుంది:

బెల్లం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి సమస్యలు ఉండవు. ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలని దూరం చేస్తుంది.

మోకాళ్ళు నొప్పులు ఉండవు:

బెల్లం తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు ఉండవు. కొద్దిగా బెల్లం తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మీరు అల్లం, బెల్లం కలిపి తీసుకుంటే కూడా మీకు మోకాళ్ళ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది.

ఎముకలు దృఢంగా ఉంటాయి:

బెల్లంలో క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ఎముకల్ని దృఢంగా చేస్తుంది. ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు మనం చెక్ పెట్టొచ్చు.