పిల్లల్లో, యువతలో కడుపునొప్పి సమస్యలు..!

-

చాలా మంది చిన్నారులు కడుపునొప్పి(Abdominal problems), డయేరియా, వాంతులు మరియు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలతో ఒక వారం నుండి బాధపడుతున్నారు. యువతీ యువకులు ఇటువంటి సమస్యలతో ఎక్కువ బాధ పడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు.

డాక్టర్లు ఏం చెప్పారంటే.? లాక్ డౌన్ అన్ లాక్ అయిన తర్వాత చాలా మంది యువతీ యువకులు బయటి ఆహారం తీసుకుంటున్నారని.. పార్టీలుకి, పెళ్లిళ్లుకి కూడా వెళ్తున్నారని దీంతో చాలా మందికి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు వచ్చాయని డాక్టర్ అంటున్నారు.

అయితే ఇప్పటి దాక లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లోనే ఉండడం వలన బయటి ఆహారం తీసుకోలేదని కనీసం బయటకు వెళ్ళలేదు బయట ఆహారం తీసుకోలేదని అని అన్నారు. కానీ లాక్ డౌన్ అన్ లాక్ అయిన వెంటనే బయట ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు గుర్తించారు.

ఇలా బయటకు వెళ్ళి ఆహారం తినే వాళ్లే అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు గుర్తించారు. అదే విధంగా మరొక కారణం ఏమిటంటే..? వాతావరణం మార్పు. వర్షాలు పడటం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయని కొన్ని చోట్ల డ్రైనేజ్ ఫెసిలిటీస్ సరిగాలేవని వీటి కారణంగా అనారోగ్య సమస్యలు పిల్లల్లో వస్తున్నాయని గుర్తించారు.

సీజనల్ మార్పు వల్ల ఎక్కువ మంది అనారోగ్య సమస్యలకు గురవుతారని ప్రతి సంవత్సరం సీజనల్ మార్పు వల్ల మేము ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళని చూస్తామని డాక్టర్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news