గర్భిణీలు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చా..? ప్రభుత్వం జారీ చేసిన కొత్త గైడ్లైన్స్..!

-

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. మరొక పక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా కొనసాగుతోంది. అయితే గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేదా అనే విషయంపై సందేహం చాలా మందిలో ఉంది.

కరోనా వ్యాక్సిన్/ గర్భిణీలు

దీనికి సంబంధించి యూనియన్ హెల్త్ మినిస్టరీ కొన్ని గైడ్ లైన్స్ ని జారీ చేయడం జరిగింది. గర్భిణీలు కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాళ్లు కూడా వైరస్ సోకకుండా ఉండడానికి వాక్సిన్ తీసుకోవాలని హెల్త్ మినిస్టరీ చెప్పడం జరిగింది.

కరోనా వ్యాక్సిన్ గర్భిణీలు తీసుకుంటే ఏమవుతుంది..?

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గర్భిణీలకు కరోనా వైరస్ ముప్పు తగ్గుతుందని చెప్పింది. వ్యాక్సిన్ తీసుకునే వాళ్లకి వైరస్ రాకుండా ప్రొటెక్షన్ గా ఉంటుంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి.

కొద్దిగా జ్వరం, టీకా వేసిన ప్రాంతంలో నొప్పి కలగడం, ఆరోగ్యం ఒకటి నుండి మూడు రోజుల పాటు సరిగా ఉండక పోవడం లాంటి సమస్యలు కనిపించవచ్చు. చాలా అరుదుగా 20 రోజుల పాటు కూడా వ్యాక్సిన్ వలన ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని మినిస్టరీ చెప్పింది.

కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణీలలో రికవరీ రేటు:

గర్భిణిలు వ్యాక్సిన్ వేయించుకుంటే 90 శాతం మంది రికవరీ అయ్యారని హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా సురక్షితంగా ఉన్నారని డేటా ద్వారా తెలుస్తోంది.

కరోనా తగ్గిన తర్వాత రిస్క్ ఎవరికి ఉంటుంది..?

35 ఏళ్లు దాటిన వాళ్లకి, ఒబిసిటీ, డయాబెటిస్ లేదా హై బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు కనబడుతోంది. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళకి కరోనా వస్తే ప్రిమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది.

పుట్టబోయే శిశువు బరువు 2.5 కేజీల కంటే తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది ప్రతి ఒక్క గర్భిణీ కూడా వ్యాక్సిన్ చేయించుకోవడం మంచిదని యూనియన్ హెల్త్ మినిస్టరీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news