పియర్స్ ఫ్రూట్ (బేరి పండు) ప్రయోజనాలు తెలుసుకోండి..

-

కరోనా కారణంగా పండ్ల ఆవశ్యకత ప్రతీ ఒక్కరికీ తెలిసింది. అందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఏ విధంగా సాయం చేస్తాయో అర్థం చేసుకున్నారు. అందుకే పండ్లని ఆహారంగా తీసుకోవడం బాగా పెరిగింది. ఏ రుతువులో దొరికే పండ్లని ఆ రుతువులో తప్పక తినాలని చెబుతుంటారు. వేసవిలో మామిడి పండ్లు ఫేమస్. దానితో పాటు చాలా రకాల పండ్లు మార్కెట్లో కనబడుతుంటాయి. అలా కనబడే వాటిలో పియర్స్ కూడా ఒకటి. ఆరోగ్యానికి పియర్స్ చేసే మేలు అంతా ఇంతా కాదు.

పియర్స్ ఫ్రూట్ వల్ల కలిగే ప్రయోజనాలని ఇప్పుడు తెలుసుకుందాం.

పియర్స్ లో కాల్షియం, ఐరన్,మ్ ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం వంటి వాటితో పాటు విటమిన్లు సి, ఈ, కే ఉంటాయి. దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మహిళల్లో ముఖ్యంగా మెనోపాజ్ దశ దాటినవారికి గర్భ కోశ సమస్యలూ తగ్గిపోతాయి. గుండెజబ్బులు రాకుండా సాయపడుతుంది. కంటిచూపు మెరుగుపడడానికి బాగా పనిచేస్తుంది. అంతే కాదు ఎలర్జీలను దూరం చేసే పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇంకా బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక మంచి ఔషధంగా పనిచేస్తుంది.

కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ ఫైబర్, తక్కువ కేలరీలు శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఇందులో ఉండే బీటా కెరాటిన్, విటమిన్ల కారణంగా ఎక్కువ వయసు ఉన్నవారు తీసుకుంటే యవ్వనంగా కనిపిస్తారు. ఇంకా ఇది యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శరీరంలోని విష పదార్థాలని బయటకు పంపించడంలో పియర్స్ పాత్ర కీలకంగా ఉంటుంది. అందుకే వేసవిలో మామిడి పండ్లతో పాటు పియర్స్ ని కూడా మీ ఆహారంలో భాగం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news