మెరిసే ముఖం కోసం నల్ల మినపపప్పు చేసే ప్రయోజనం తెలుసుకోండి..

-

సెకండ్ వేవ్ అందరినీ ఇంట్లోనే కూర్చోబెట్టింది. విపరీతంగా పెరుగుతున్న కేసుల వలన ఎవరూ బయటకి వెళ్ళే సాహసం చేయట్లేదు. ఈ నేపథ్యంలో ఆడవాళ్ళకి పార్లర్ సమస్య వచ్చి పడింది. ఇంట్లోనే ఉంటూ చర్మ సంరక్షణ కోసం చేయాల్సిన పనులు చేసుకుంటున్నారు. ఆ విధంగా చర్మ సంరక్షణలో వాడే పదార్థాల్లో నల్ల మినప పప్పు ఒకటి. పప్పులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ మేలు చర్మానికి సంబంధించి కూడా ఉంది. ప్రస్తుతం నల్ల మినప పప్పుతో చర్మానికి కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాం.

మెరిసే ముఖం కోసం ఫేస్ ప్యాక్ తప్పనిసరి. ముఖంపై మొటిమలు పోవడానికి, రాకుండా ఉండడానికి మెరిసేలా తయారవడానికి ఇది చాలా అవసరం. నల్ల మినప పప్పుతో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. దీనికోసం మీరు నాలుగు చెంచాల మినప పప్పు తీసుకుని, 2బాదం పప్పులని కలుపుని రాత్రిపూట నానబెట్టండి. ఉదయం పూట వాటిలోంచి నీటిని అంతా తీసి ఆ పప్పుని పాలల్లో కలపండి. అప్పుడు ఓ మందపాటి పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్టుని ముఖంపై మెడపై బాగా వర్తించాలి.

ఆ తర్వాత కొద్దిసేపటికి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా బ్లాక్ హెడ్స్ ను తొలగిపోతాయి. ఫేస్ ప్యాక్ లా వాడడమే కాకుండా మినప పప్పుని మీ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం. ఈ పప్పులో హైడ్రేట్ చేసే శక్తి ఉంటుంది. అందువల్ల చర్మానికి బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news