ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే ఈ సమస్యలు వస్తాయి..!

-

ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్(Breakfast) తీసుకోవడం చాలా ముఖ్యం. కాని చాలామంది దీనిని స్కిప్ చేస్తూ ఉంటారు దీని వల్ల రోజంతా కూడా ఎనర్జిటిక్ గా ఉండడానికి వీలవ్వదు. ప్రతి రోజూ తప్పని సరిగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే డాక్టర్లు ఎప్పుడూ అల్పాహారాన్ని స్కిప్ చెయ్యద్దు అని చెప్తున్నారు.

ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒబిసిటీ నుండి బరువు తగ్గడం వరకు ఎన్నో సమస్యలకు పరిష్కారం మనకి దొరుకుతుంది. ఎప్పుడూ కూడా అల్పాహారం లేదా ఇతర మీల్స్ ని స్కిప్ చెయ్యొద్దు అని డాక్టర్లు చెబుతున్నారు.

ఒకవేళ కనుక మీరు బ్రేక్ఫాస్ట్ తినకపోతే మిగిలిన సమయంలో మీకు మరింత ఆకలిగా ఉంటుంది అప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఒబిసిటీ సమస్య వస్తుందని అంటున్నారు. దీనితో పాటుగా మరి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ముఖ్యంగా డయాబెటిస్ వంటి సమస్యలు అల్పాహారం తీసుకోకపోవడం వల్ల వస్తాయని అంటున్నారు.

బరువు పెరిగిపోవడం కూడా అల్పాహారం స్కిప్ చేయడం వల్ల వస్తుంది అన్నారు. ముఖ్యంగా ఉదయాన్నే ఆహారం ఎక్కువగా ఆహరం తీసుకోవాలి. ఎవరైతే అల్పాహారం తీసుకోరో వాళ్ళల్లో హార్ట్ ఎటాక్ కూడా వస్తుందని అంటున్నారు.

అల్పాహారం స్క్రిప్ చేయడం వల్ల మైగ్రేన్ సమస్య కూడా వస్తుంది కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే తప్పని సరిగా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. లేదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news