క్యారెట్‌ మాల్పువా.. తక్కువ టైంలో టేస్టీ స్వీట్‌ ఇలా చేసేయండి..!

-

క్యారెట్‌తో ఏ స్వీట్‌ చేసినా చాలా బాగుంటుంది. అయితే స్వీట్‌ అంటే అందరూ పంచదార, బెల్లం అనే అనుకుంటారు. కానీ ఖర్జూరం, తేనెతో కూడా స్వీట్‌ చేసుకోవచ్చు. మనం ఈ సైట్‌లో ఎన్నో రకాల స్వీట్స్‌ను ఎలా చేయాలో కూడా అందించారం. ఈరోజు మనం క్యారెట్‌తో మాల్పువా ఎలా చేసుకోవాలో చూద్దామా.!

క్యారెట్‌ మాల్పువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

క్యారెట్‌ ముక్కలు ఒక కప్పు
మల్టీగ్రెయిన్‌ పిండి అరకప్పు
పాలు అరకప్పు
కొబ్బరి పాలు అరకప్పు
తేనె ఒక కప్పు
బొంబాయి రవ్వ రెండు టేబుల్‌ స్పూన్స్‌
మీగడ ఒక టేబుల్‌ స్పూన్
సోంపు ఒక టీ స్పూన్
యాలుకపొడి ఒక టీ స్పూన్

తయారు చేసే విధానం..

ముందుగా ఒక మిక్సీ జార్‌ తీసుకుని అందులో క్యారెట్‌ ముక్కలు వేసి లైట్‌గా గ్రైండ్‌ చేయండి. అప్పుడు అందులో పాలు కలిపి మెత్తగా పేస్ట్‌లా చేయండి. ఈ. పేస్ట్‌ను ఒక బౌల్‌లో తీసుకుని అందులో రెండు టేబుల్‌ స్పూన్స్‌ తేనె, సోంపు, యాలుకలపొడి, బొంబాయి రవ్వ, మల్టీగ్రెయిన్‌ పిండి, కొబ్బరిపాలు పోసి కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకోండి. గుంటలు ఉండే నాన్‌స్టిక్‌ పాత్ర తీసుకుని..అందులో ఈ మిశ్రమం వేయండి. గుంటల్లో పలుచుగా వేయండి. స్లోగా కాలనివ్వకండి. ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోని పక్కన పెట్టుకోండి.

పొయ్యిమీద ఒక. పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసి తేనె అందులో వేయండి. తేనె బదులు, చెరుకు రసం కూడా వేయొచ్చు. యాలుకల పొడి వేసి పది నిమిషాలు వేడి చేయండి. ఈ పాకంలో ముందుగా చేసుకున్న క్యారెట్‌ మాల్పువా వేస్తే అవి పీల్చుకుంటాయి. అప్పుడు వాటిపై డ్రసింగ్‌కోసం.. బాదంపప్పు స్లైస్‌స్‌ వేస్తే సరి..! ఎంతో రుచికరమైన, టేస్టీ అయినా క్యారెట్‌ మాల్పువా రెడీ.. ఎక్కువ మంది పంచదార పాకం వాడతారు. పంచదార ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇలా చేసుకుంటే..ఎన్ని అయినా తినొచ్చు. స్వీట్స్‌ను కూడా ఆరోగ్యకరంగా తినడం అంటే ఇదే..! ఈసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రే చేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news