టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు పోయేందుకు సిద్దమవుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హమీలను కేసీఆర్ తుంగలో తొక్కి మరోసారి ఎన్నికల్లో ప్రజలను మోసగించేందికు సిద్దమవుతున్నాడని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ ప్రజా, సంక్షేమ పథకాలను ప్రజలకు కార్యకర్తలు విధిగా తెలియజేయాలన్నారు.
ఆయుష్ మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవటంతో పేదలు వైధ్యం కోసం ఇబ్బంది పడుతున్నారని ఆమె అన్నారు. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చి పేదలకి కేంద్రం అండగా నిలిచిందని, మోడీ పాలనతో శత్రుదేశాలు సైతం భారత్ వైపు చూడడానికి జంకుతున్నారన్నారు. గతంలో సొంత జాగాలున్న వారికి 5 లక్షలు ఇస్తామని ఇప్పుడు 3 లక్షలకు తగ్గించి మోసం చేస్తున్నాడని ఆమె మండిపడ్డారు.