చిరోంజి గింజలు.. నెల రోజులు వాడితే చాలు ఒక్క వెంట్రుక కూడా రాలదు

-

ఈరోజుల్లో ఆడమగ తేడా లేకుండా.. అందరికీ జుట్టు రాలిపోతుంది.. అసలు ఏం చేసినా, ఎంత ఖరీదైనా ఆయిల్స్‌ వాడినా.. పెద్దగా ఉపయోగం ఉండటం లేదని అందరూ చెప్పే మాట.. ఎందుకు ఉంటుంది.. మీరు జుట్టుకు ఏవేవో అప్లై చేస్తున్నారు కానీ.. మీ బ్రెయిన్‌ ఇంకా మనసును పరిపరి విధాలుగా ఆలోచించకుండా, ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా ఉంచడం లేదు కదా.. జుట్టు ఒక్కటే కాదు.. మొత్తం మీ ఆరోగ్యాన్ని బాగు చేసే మెడిసిన్‌.. ఎక్కడో షాపుల్లో కాదు.. మీ దగ్గరే ఉంది.. ముందు మీరు హ్యాపీగా, ఒత్తిడి లేకుండా.. అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా ఉంటే.. చాలా సమస్యలు తగ్గుతాయి. దీంతో పాటు.. కాస్త హెల్తీ ఫుడ్‌ తింటే సరి..! జుట్టు కోసం.. బాహ్యంగా ఇప్పటి వరకూ ఏదేదో చేసి ఉంటారు.. ఈ గింజలను నాలుగు వారాల పాటు వాడి చూడండి.. అదిరిపోయే రిజల్ట్‌ ఉంటుంది.. సైంటిఫికల్లీ ప్రూవ్‌డ్‌ అండీ..!

జుట్టు రాలడాన్ని తగ్గించే విత్తనం ఒకటి ఉంది.. అదే చిరోంజి. ఇది జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిరోంజి వాడటం వల్ల జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. అవును, మీరు చిరోంజీని తీపి వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటారు. కానీ అది కూడా గుణాలతో నిండి ఉంటుంది. నిపుణుల సలహా మేరకు దీన్ని తీసుకుంటే మీకే తేడా అనిపిస్తుంది.

చిరోంజి ప్రయోజనాలు

చిరోంజిలో ఇనుము, కాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
ఇందులో మంచి కొవ్వు పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్ చాలా అవసరం ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.
ఇది జుట్టును బలోపేతం చేయడానికి, విరిగిపోకుండా నిరోధించడానికి మంచిదని భావిస్తారు.
చిరోంజి గింజలు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది
చిరోంజిలో ఉండే లక్షణాలు జుట్టు మూలాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.,
చిరోంజి గింజలు తినడంతో పాటు, దాని నూనెను రాసుకోవడం వల్ల కూడా జుట్టు పెరుగుతుంది.
చిరోంజి మాస్క్ జుట్టు కండిషనింగ్‌కు కూడా మంచిదని భావిస్తారు.
జుట్టుతో పాటు జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. చిరోంజీ మన రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా శరీరానికి బలాన్ని ఇస్తుంది.

ఎలా తినాలంటే..
2 స్పూన్ చిరోంజి గింజలను రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే లేచి తినాలి.
4 వారాల పాటు డైలీ తినండి. జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

ఇవి బయట సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతాయి లేదా ఆన్‌లైన్‌ మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.. వీటి ధర కూడా ఎక్కువే కాదు.. 200 నుంచి ఉన్నాయి.. ఇప్పటి వరకూ ఏవేవో ట్రై చేసి ఉంటారు.. ఆఖరి ప్రయత్నంగా ఈ గింజలు వాడి చూడండి.!

Read more RELATED
Recommended to you

Latest news