కార్న్ పకోడి తయారీ విధానం

-

స్కూల్‌కు వెళ్లే పిల్లలున్న తల్లులకు సాయంత్రం స్నాక్స్‌గా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు ఇంటికి రాగానే చిరుతిండ్లు కావాలని మారాం చేస్తుంటారు. అలాంటప్పుడు ఈ కార్న్ పకోడి చేసి పెట్టండి. చాలా హ్యాపీగా లొట్టలేసుకొని లాగించేస్తారు.

కావలసినవి :
బేబీ కార్న్ : పది
శనగపిండి : పావు కప్పు
పసుపు : పావు టీస్పూన్
కారం : అర టీస్పూన్
ఛాట్ మసాలా : తగినంత (కొంచెం)
అల్లంవెల్లుల్లి పేస్ట్ : టీ స్పూన్
జీలకర్రపొడి : అర టీస్పూన్
ధనియాల పొడి : టీ స్పూన్
నూనె : సరిపడా
ఉప్పు : తగినంత.
తయారీ :
ముందుగా బేబీకార్న్ కండెలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి. వాటిని నీళ్లలో కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత అందులో నీరు తీసేసి కార్న్ పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో శనగపిండి తీసుకొని పసుపు, కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, జీలకర్రపొడి, ధనియాల పొడి, కొంచెం నీరు పోసి కలుపుకోవాలి. మిశ్రమం చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన కార్న్ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి చేశాక ఈ కార్న్ ముక్కలు వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. ఛాట్ మాసాలా చల్లుకొని సర్వ్ చేసుకుంటే కార్న్ పకోడీని లాగించేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news