వేసవిలో వచ్చే జీర్ణ సంబంధ రోగాలను దూరం చేసే అద్భుతమైన ఆహారం గురించి తెలుసుకోండి..

-

వేసవిలో చాలా మంది ఎదురుకునే సమస్యల్లో ప్రధానమైనది జీర్ణ సమస్య. పై నుండి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న టైంలో ఒంట్లో వేడి బాగా పెరుగుతుంది. అందువల్ల సరైన ఆహారాలని తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో అది జీర్ణం కాకుండా ఇబ్బంది పెడుతుంది. అలాంటి ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని రకాల ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. అందులో ముఖ్యమైనది దోసకాయ. అవును, దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చల్లదనాన్ని పెంచి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

దోసకాయ వల్ల కలిగే ప్రయోజనాలు.

90 శాతం నీరు ఉండడంతో పాటు ఫైబర్, విటమిన్లు, కాల్షియం, అయోడిన్, పొటాషియం, భాస్వరం మరియు మెగ్నీషియం ఖనిజాలు దోసకాయలో పుష్కలంగా కనిపిస్తాయి. అందుకే దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో సలాడ్లలో దీన్ని బాగా వాడతారు.

జీర్ణ సమస్యలు ఉన్నవారు దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. జీర్ణ క్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల వచ్చే మలబద్ధకం, అసిడిటీ, ఛాతీ చికాకు, వంటి కడుపు సమస్యల నుండి దూరం కావాలంటే దోసకాయని తినండి.

డీహైడ్రేషన్ ని తగ్గిస్తుంది

దోసకాయలో 90శాతం నీరు ఉంటుంది. దానివల్ల మెదడుకి సరైన పాళ్ళలో ఆక్సిజన్ అందుతుంది. అందువల్ల మీరు చురుగ్గా పని చేయగలుగుతారు. దోసకాయ విత్తనాల్లో ఉండే పోషకాలు వేడి చేయడాన్ని తగ్గిస్తాయి. చిరాకు, ఆందోళన, కోపం వంటి మానసిక సమస్యలకు ఈ వేడి కారణం కావచ్చు. దాన్ని తగ్గించడానికి దోసకాయ తినాల్సిందే. మనం తీసుకునే ఆహారమే మన ప్రవర్తనని నిర్ణయిస్తుందన్న విషయం గుర్తుంచుకోండి. రుతువు మారినప్పుడు ఆహారంలో మార్పులు అవసరమే.

Read more RELATED
Recommended to you

Latest news