బండి సంజయ్ పై ఆలోచన మార్చుకున్న కేసీఆర్…?

-

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఒక రకంగా ఇక ముందు ఒక రకంగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఈ మధ్యకాలంలో చాలా ఆశలు పెట్టుకొన్నారు. దీనితో కొంతమంది నేతలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. బండి సంజయ్ దగ్గర ఇమేజ్ కోసం కొంతమంది నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారని కూడా అంటున్నారు.

అందులో నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కూడా ఉన్నారని రాజకీయవర్గాల సమాచారం. అయితే ఇప్పుడు బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీని మరింత ఇబ్బంది పెట్టి భారతీయ జనతా పార్టీలో తన స్థానాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేసి ఇప్పటికే బండి సంజయ్ చర్చలు జరుపుతున్నారని సమాచారం.

త్వరలోనే వాళ్లని పార్టీలోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ లోకి తెలంగాణలో ఎవరు కూడా వచ్చే అవకాశం లేకపోయినా సరే బండి సంజయ్ వారి మీద అస్త్రాలను ప్రయోగిస్తున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఈ రాజకీయం ఎంతవరకు బిజెపి కలిసొస్తుందో చూడాలి. అయితే సీఎం కేసీఆర్ మాత్రం టిఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తే బండి సంజయ్ విషయంలో కఠినంగా ముందుకు వెళ్లవచ్చు అనేది కొంతమంది భావన.

Read more RELATED
Recommended to you

Latest news