వర్షాకాలంలో అసలు ముట్టుకోకూడని ఆహారాలు.. 

వర్షాకాలం వచ్చిందంటే ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావాలి. వర్షాలు బాగా కురిసే ఈ సమయంలో కొన్ని ఆహార పదార్థాలను ముట్టుకోకపోవడం చాలా మంచిది. లేదంటే దానిలోని బాక్టీరియా కారణంగా అనేక వ్యాధులు సోకే అవకాశం ఉంది. అలాగే రోగనిరోధక శక్తి మీద ప్రభావం చూపుతాయి. అందుకే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పుల్లటి ఆహారాలు

పులుపుగా ఉండే మిఠాయి, చింతపండుతో చేసిన ఆహారాలు పక్కన పెట్టేయడమే మంచిది. పుల్లని ఆహారాలు శరీరంలో నీటిని నిలుపుకోవటానికి కారణమవుతాయి. దానివల్ల శరీరం ఉబ్బినట్లు అనిపిస్తుంది. అంతేకాదు పుల్లటి ఆహారాలు జ్వరానికి కూడా కారణంగా ఉంటాయి.

జ్యూస్

ఇంట్లో తయారు చేసేది కాకుండా రోడ్డు పక్కన అమ్మే జ్యూస్ అస్సలు ముట్టుకోవద్దు. సాధారణంగా రోడ్డు పక్కన అమ్మేవారు పండ్లను ముందే కోసి పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల బాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువ. అలాంటి జ్యూస్ మీరు తాగితే రోగాల బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి జ్యూస్ తాగాలనుకుంటే అప్పుడే కోసిన పండ్లతో ఇంట్లోనే తయారు చేసుకోండి.

సముద్ర ఆహారం

వర్షాకాలంలో చేపలను పెంచుతారు. అలాంటి సమయాల్లో సముద్ర ఆహారం మానుకోవడమే మంచిది.

ఆకు కూరలు

ఆకు కూరలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. నిజానికి వీటిని ఏ కాలంలోనైనా తినవచ్చు. కానీ వర్షాకాలంలో కొన్ని రోజుల పఅటు తినకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆకు కూరల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్యాబేజీ వంటి వాటిల్లో తేమ కారణంగా సూక్ష్మ క్రిములు నిలిచి ఉంటాయి. కాబట్టి వాటిని ముట్టుకోకపోవడమే ఉచితం. కాలానుగుణంగా సరైన కూరగాయలను ఎంచుకుని సరిగ్గా వండి తినండి.