విరిగిన, మెత్తపడిన బిస్కెట్లు పడేస్తున్నారా..వాటితో టేస్టీ రెసీపీలు చేయొచ్చు తెలుసా..!

-

జనరల్ గా బిస్కెట్స్ మెత్తపడినా, బాగా విరిగిపోయినా, తినగా మిగిలిపోయిన బిస్కెట్లు మనం కేరాఫ్ డస్ట్ బిన్ లోనే వేస్తాం. కొన్ని సార్లు ఇవి ఎక్కువగా ఉంటాయి. మనసొప్పదు కదా..తినేవాటిని అలా పారేయడానికి. కానీ మీకు తెలుసా వీటిని మళ్లీ ఉపయోగించి టేస్టీ ఫుడ్ ఐటమ్స్ తయారుచేయొచ్చని. ఈవినింగ్ స్నాక్స్ గా చేసుకుని లాగించేయొచ్చు. మరి ఇంకెందుకు లేట్..అవేలా చేయాలో చూసేద్దాం.

కట్లెట్..

ఈ టేస్టీ వెజ్ కట్లెట్స్ చేయడానికి, 1 కప్పు సాల్టీ క్రాకర్స్ పొడి తీసుకుని, అందులో మెత్తని బంగాళాదుంపలు, క్యారెట్లు, బీట్‌రూట్‌లు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకులు, మసాలా దినుసులు, కొద్దిగా మొక్కజొన్న పిండి వేసి బాగా కలపండి. ఒక ముద్దలా చేసుకోని చిన్న చిన్న కట్లెట్స్ చేసుకోండి.. ఈలోగా పాన్ వేడి చేసి నూనె వేసి కట్లెట్స్, ఫ్లిప్ చేస్తూ బాగా వేయించాలి. అంతే కట్లెట్ రెడీ.!

మొనాకో బిస్కట్ చాట్..

మిగిలిన మొనాకో లేదా ఏదైనా సాల్టెడ్ బిస్కెట్‌లతో చాట్ తయారు చేసుకోవచ్చు. టమోటాలు, దోసకాయలు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వంటి కూరగాయలను కడిగి, తరగాలి. తరువాత వేయించిన జీరా పొడి, ఎర్ర మిరప పొడి, నల్ల ఉప్పు , మిరియాలతో పెరుగును వేసి కలపండి. విరిగిన బిస్కెట్లపై దీన్ని పోసి, ఆపై కూరగాయలు, మసాలా దినుసులు, కొన్ని కొత్తిమీర ఆకులు, చివరగా కొద్దిగా గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీతో పాటు తింటే టేస్తీ మోనాకో బిస్కట్ చాట్ రెడీ.!

చియా బిస్కట్ పుడ్డింగ్..

10 విరిగిన బిస్కెట్లను తీసుకొని.., వాటిని ఫైన్ పొడిగా చేసుకోండి. 1 లేదా రెండు టేబుల్ స్పూన్ల కరిగించిన వెన్న / పీనట్ బట్టర్ తో కలపండి. ఈ మిశ్రమంతో సర్వింగ్ గ్లాసులను లేయర్ చేయండి. తరువాత, ఒక గిన్నె తీసుకొని 3 టేబుల్ స్పూన్ల చియా గింజలు, 2 టేబుల్ స్పూన్ల పొడిచేసిన బాదం, 2 టేబుల్ స్పూన్ల మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కలపండి. అన్నింటినీ తక్కువ కొవ్వు ఉన్న వెచ్చని పాలతో కలపండి. ఈ మిశ్రమాన్ని బిస్కట్ లేయర్‌పై పోసి, రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టండి. తరువాత, ఉదయం..తేనె లేదా మాపుల్ సిరప్‌ను జోడించే తింటే టైస్ట్ అదిరిపోతుంది. అయితే ఇది కొంచెం టైం పట్టే ఐటమ్ కాబట్టి ఎక్కువమంది ట్రై చేయకపోవచ్చు.

బిస్కట్ కేక్..

బ్లెండర్ తీసుకొని 12-14 బిస్కెట్‌లను ¼ కప్పు పాలతో పాటు బ్లండ్ చేయండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాతో పాటు వెన్న, గుడ్లు, వెనిలా ఎసెన్స్‌తో మెత్తని పేస్ట్ చేయండి. అన్నింటినీ చక్కగా కలపండి, బేకింగ్ ట్రేకు వెన్న లేదా ఆయిల్ వేసి పిండిని పోయాలి. గింజలు, డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి పర్ఫెక్ట్‌గా బేక్ చేయండి. అంతే బిస్కట్ కేక్ రెడీ.!

బిస్కట్ లడ్డూ..

10 బిస్కెట్లను పొడి చేసి, దానికి ½ కప్పు పాలు, 1 కప్పు ఎండిన కొబ్బరి, తరిగిన డ్రై ఫ్రూట్స్‌తో కలపండి. అన్నింటినీ కలిపి మీ అరచేతులకు నూనె పూసుకుని చిన్న లడ్డూలను రోల్ చేయండి. వీటిని ఎప్పుడైనా తినవచ్చు. ఆరోగ్యానికి కూడా ఇది మంచిదే.

ఇప్పుడు ఇదంతా చదివాక కొంతమందికి ఇలా అనిపిస్తుంది. పావలా ఖరీదు చేసే కోడిపిల్లకు ముప్పావలా పెట్టి వైద్యం చేసినట్లు ఇదంతా ఎవడు చేస్తాడు అనుకుంటున్నారా..తక్కువ మొత్తంలో వేస్ట్ అయితే అలా వదిలేయచ్చు. బిస్కెట్లు ఒక్కోసారి ఎక్కువగా వేస్ట్ అవుతాయి..చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాంటి రెసీపీస్ చేస్తే వాళ్లు సంతోషంగా తింటారు కూడా.! టైం ఉన్నప్పుడ ట్రై చేయటంలో తప్పేంలేదుగా..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version