ఉసిరిని ఎన్ని రకాల ఆహారాలుగా తయారు చేసుకోవచ్చో తెలుసా..?

-

భారతదేశంలో దొరికే పండ్లు, కూరగాయల్లో అనేక పోషక విలువలు ఉంటాయి. మన నేలలో పండే ప్రతీదానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నో మూలికలకి అనువైన ఈ ప్రాంతంలో ఎన్నో రకాల ఔషధ మూలికలు ఉన్నాయి. అవి మానవాళికి చాలా సాయం చేస్తాయి. మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చే మూలికల్లో ఉసిరి కూడా ఒకటి. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా జీర్ణ సమస్యలని దూరం చేస్తుంది. కంటి సమస్యలని తగ్గించడానికి ఉసిరి బాగా ఉపయోగపడుతుంది.

మరి ఇన్ని ప్రయోజనాలున్న ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది. ఐతే ఉసిరిని ఎన్ని రకాలుగా తినవచ్చో చాలా మందికి తెలియదు. కొందరు దీన్ని పచ్చికాయగా ఉన్నప్పుడే తింటారు. మరికొందరు పచ్చడి చేసుకుంటారు. ఇంకొందరు ఉసిరి పొడి తయారు చేస్తారు. ఇక్కడ ఉసిరిని ఆహారంగా తీసుకునే మరిన్ని రకాల గురించి తెలుసుకుందాం.

పొడి

పొద్దున్న లేవగానే ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని తీసుకుని, గోరు వెచ్చని నీటిలో కలుపుకోవాలి. అందులో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి.

జ్యూస్

20మిల్లీ లీటర్ల ఉసిరి జ్యూస్ ని గోరువెచ్చని నీటిలో కలుపుకు పొద్దున్న లేవగానే తాగాలి.

చ్యవన్ ప్రాశ్

చ్యవన్ ప్రాశ్ లో ఉండే ముఖ్యమైన పదార్థం ఉసిరి. పొద్దున్న లేవగానే అయినా సరే లేదా ఆహారం తిన్న తర్వాత అయినా సరే, ఒక గ్లాసు నీళ్ళలో చ్యవన్ ప్రాశ్ పొడిని కలుపుకుని తాగితే బెటర్.

పచ్చడి

తెలుగు వారికి పచ్చళ్ళంటే ప్రాణం. ఉసిరి పచ్చడిని ఆహారంలో భాగం చేసుకున్నా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Read more RELATED
Recommended to you

Latest news