హెల్ది అయిన జీడిపప్పు మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలి అంటే …!

-

పిల్లలు, పెద్దలు అందరికి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మంచి పోషకాలు అందుతాయి. కాని పిల్లలు కొంతమంది డ్రై ఫ్రూట్స్ దగ్గరకు రానివ్వరు. అలాంటి వారి కోసం ఇలా జీడిపప్పు పొడి తో మైసూర్ పాక్ చేసి పెట్టండి. శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అయితే జీడిపప్పు మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

జీడిపప్పు మైసూర్ పాక్ తయారీకి కావలసిన పదార్థాలు: జీడిపప్పు పొడి 1/3 కప్పు, మైదా పిండి 1/3 కప్పు, నెయ్యి 3 కప్పులు, పంచదార ¾ కప్పు, యాలకుల పొడి ½ టీ స్పూన్.

తయారీ విధానం: ఒక గిన్నెలో జీడిపప్పు పొడి , మైదా, యాలకుల పొడి, అర కప్పు వేడి చేసిన నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి పంచదార, 1/3 కప్పుల నీరు పోసి తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. ఆ తరువాత మంట తగ్గించి జీడిపప్పు పొడి మిశ్రమాన్ని పోస్తూ ఉండలు కట్టకుండా తిప్పాలి. మధ్య మధ్యలో వేడి నెయ్యిని కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి. గిన్నె అంచుల చివరన నెయ్యి తేలే వరకు కలపాలి. ఈ మిశ్రమం దగ్గరగా వచ్చే వరకు కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్ళెంలోకి మార్చి పళ్ళెం అంతా సర్దాలి. వేడిగా ఉన్నప్పుడే కావలసిన షేపులో ముక్కలు కట్ చేయాలి.అంతే జీడిపప్పు మైసూర్ పాక్ రెడీ..

పోషకాలు: కేలరీస్ 631, ప్రోటీన్స్ 0.9 g, కార్బోహైడ్రేట్స్ 14.4g , పైబర్ 0 g, కొవ్వు 63.3g, విటమిన్స్ 562.5 mg, మినరల్స్ 51.3mg.

Read more RELATED
Recommended to you

Latest news