హెల్ది అయిన కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్…!

-

సాధారణం గా పెళ్ళిళ్ళు, పండగలు, వేడుకలు సమయంలో కస్టర్డ్ ఫ్రుడ్ సలాడ్ ని ఎక్కువగా చేస్తుంటారు. ఎంతో రుచికరమైన ఈ కస్టర్డ్ సలాడ్ మన శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. దీన్ని పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి సలాడ్లను ఇంట్లో చాలా తక్కువ సమయంలో చేసుకుని ఇంట్లో అందరు తినవచ్చు.

కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారీకి కావలసిన పదార్థాలు: పాలు 3 కప్పులు, షుగర్ 4 టేబుల్ స్పూన్లు, కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు, ద్రాక్ష పండ్లు ½ కప్పు, మామిడి ముక్కలు ½ కప్పు, యాపిల్ ½ కప్పు, దానిమ్మ గింజలు ½ కప్పు, సపోటా ½ కప్పు, జీడిపప్పు, బాదం తరుగు.

తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి రెండు కప్పుల పాలు పోసి షుగర్ కలిపి సన్నటి మంట పై మరిగించాలి. తర్వాత మిగిలిన పాలలో కస్టర్డ్ పౌడర్ కలపాలి. తర్వాత మరుగుతున్న పాలలో కస్టర్డ్ కలిపిన పాలు కూడా పోసి 5 నిమిషాలు ఉడికించి బాగా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ పాలు ఆరాక 15 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ లోగా ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఫ్రిజ్ లోని పాలను బయటకు తీసి కట్ చేసుకున్న ఫ్రూట్స్ ని ఆ పాలలో కలిపి మల్లి ఫ్రిజ్ లో 1 గంట పెడితే సరిపోతుంది. పైన ఇష్టాన్ని బట్టి జీడిపప్పు, బాదం తరుగుని వేసుకోవచ్చు. అంతే ఒక గంట తర్వాత ఫ్రిజ్ లో నుండి తీసి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ని సర్వ్ చేసుకోవడమే.

దీనిలో పోషక విలువలు: ఒక కప్పు సలాడ్ లో కేలరీస్ 109, కార్బోహైడ్రేట్స్ 19g, ఫాట్ 2g, ప్రోటీన్ 3g, కాల్షియం 15%, షుగర్స్ 16g.

Read more RELATED
Recommended to you

Latest news