సండే స్పెషల్ ;ప్రాన్స్ బిర్యాని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలి అంటే …!

-

ఆదివారం కోసం నాన్ వెజ్ ప్రియులు ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే ఎప్పుడు ఇంట్లో వండే చికెన్ కూర తిని బోర్ గా ఉంటే కాస్త ఓపికతో కొంచెం టైం తీసుకుని రెస్టారెంట్ రుచిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మందికి రొయ్యలు వండటం రాదు. అలాంటి వారి కోసం ఎంతో టేస్టీ అయిన రొయ్యల బిర్యాని రెస్టారెంట్ స్టైల్లో నేర్చుకుందాం.

కావలసిన పదార్థాలు: మసాలా కొరకు షాజీరా 1 స్పూన్, సోంపు 1 స్పూన్, యాలకులు 4, లవంగాలు 5, దాల్చిన చెక్క చిన్న ముక్క. వేయించి పొడి కొట్టాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెద్దవి 2, వేయించడానికి సరిపడా నూనె 1 స్పూన్. వీటిని వేయించి ఉంచాలి.

మారినేషన్ కొరకు: రొయ్యలు 300g, పెరుగు 300g, సాల్ట్ తగినంత, కారం 2 స్పూన్లు , బిర్యాని మసాలా 2 స్పూన్లు, వేయించిన ఉల్లిపాయలు సగం, తరిగిన పచ్చి మిర్చి 2, నిమ్మకాయ 1, ½ కప్పు పుదీనా ఆకులు. ఇవన్ని కలిపి అరగంట వరకు నాననివ్వాలి.

అన్నం కోసం 300 గ్రాముల బాస్మతి రైస్, 2 స్పూన్లు, బిర్యాని ఆకులు 2, సాల్ట్ రుచికి సరిపడా, నూనె 2 స్పూన్లు, పుదీనా కొద్దిగా. బియ్యం కూడా అరగంట నానబెట్టాలి. ఒక గిన్నెలో అన్ని కలిపి తగినన్ని నీళ్ళు పోసి హాల్ఫ్ బాయిల్ చేసి పెట్టాలి. బిర్యాని లోకి ఆయిల్ 4 స్పూన్లు, పుదీనా ¼ కప్పు, వేయించిన ఉల్లిపాయలు.

బిర్యాని తయారి విధానం: స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లోతు ఎక్కువగా ఉన్న గిన్నెలో 4 స్పూన్ల నునే వేసి నాన బెట్టిన రొయ్యల్ని వెయ్యాలి. తర్వాత వాటిపై సగం ఉడికించిన అన్నం వేసి పైన పుదీనా, వేయించిన ఉల్లిపాయలు వేసి 10 నిమిషాలు సిమ్ లో ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తెరవకుండా కాసేపు ఉంచాలి. అంతే ఎంతో టేస్టీ రొయ్యల బిర్యాని రెడీ.

Read more RELATED
Recommended to you

Latest news